IPL 2022: కోటాను కోట్ల డబ్బు.. వేలంలో రూ.10 కోట్లకు పైగా ధరకు పలికిన ఆటగాళ్లు వీరే
IPL 2022: కోటాను కోట్ల డబ్బు.. వేలంలో రూ.10 కోట్లకు పైగా ధరకు పలికిన ఆటగాళ్లు వీరే
IPL auction: ఐపీఎల్ మెగా వేలంలో కొందరు ఆటగాళ్లు కోటీశ్వరులయ్యారు. ధనలక్ష్మి తలుపుతట్టి మరి కోట్ల వర్షం కురిపించింది. మరి నిన్న జరిగిన వేలంలో ఎంత మంది ఆటగాళ్లు రూ.10కోట్లు పైగా ధరకు అమ్ముడయ్యారు? వారిలో భారతీయులు ఎంత మంది ఉన్నారు?
ఐపీఎల్ మెగా వేలంలో భారత యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. తొలి రోజువేలంలో రూ.10 కోట్లకు పైగా ధర పలికిన ఆటగాళ్లు 10 మంది ఉంటే.. అందులో మనోళ్లే ఏడుగురు ఉన్నారు.
2/ 11
1. ఇషాన్ కిషన్: గత ఏడాది ముంబైలో టీమ్‌లో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌ను తిరిగి అదే జట్టు కొొనుగోలు చేసింది. రూ.15.25 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో రికార్డు ధర పలికిన ఆటగాడు ఇతడే.
3/ 11
2. దీపక్ చాహర్: ఇతడు కూడా తిరిగి సొంత జట్టుకే వెళ్లాడు. దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.14కోట్లకు కొనుగోలు చేసింది.
4/ 11
3. శ్రేయాస్ అయ్యర్: గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఈసారి రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. కేకేఆర్ టీమ్ అతడిని రూ.12.25 కోట్లకు సొంతం చేసుకుంది.
5/ 11
4.వానిందు హసరంగ: శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ వేలంలో అందరినీ ఆకర్షించాడు. ఇతడిని ఆర్సీబీ జట్టే తిరిగి సొంతం చేసుకుంది. రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
6/ 11
5. హర్షల్ పటేల్ సైతం తిరిగి సొంత జట్టులోకే వెళ్లాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు రూ.10.75 కోట్లకు సొంతం చేసుకుంది.
7/ 11
6. శార్దుల్ ఠాకూర్: గత ఏడాది చెన్నైలో ఉన్న శార్దుల్ ఈసారి ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఢిల్లీ జట్టు రూ.10.75 కోట్లు పెట్టి అతడిని కొనుగోలు చేసింది.
8/ 11
7. నికోలస్ పూరన్: వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాడు. గత ఏడాది పంజాబ్‌లో ఉన్న పూరన్‌ను ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.10.75 కోట్లకు దక్కించుకుంది.
9/ 11
8. ప్రసిధ్ కృష్ణ: గతంలో కేకేఆర్ టీమ్‌లో ఉన్న ప్రసిధ్ కృష్ణను ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.10 కోట్లకు సొంతం చేసుకుంది.
10/ 11
9. ఆవేశ్ ఖాన్: గత ఏడాది ఢిల్లీ జట్టులో ఉన్న అన్క్యాప్డ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ ఈసారి ఏకంగా రూ.10కోట్లకు అమ్ముడపోయి సంచలనం సృష్టించాడు. లక్నో టీమ్ ఇతడిని కొనుగోలు చేసింది.
11/ 11
10. లాకీ ఫెర్గూసన్: గత ఏడాది కేకేఆర్ టీమ్‌లో ఉన్న కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్‌ను ఈసారి గుజరాత్ టైటాన్స్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసిది.