ఈసారి ఐపీఎల్ వేలంలో కడప కుర్రాడు సత్తా చాటాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడో యంగ్ క్రికెటర్. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నె సూపర్‌కింగ్స్ జట్టులో చేరాడు (Photo Credit : Instagram)
కడప జిల్లా చిన్నమండెం మండలం బోనమల గ్రామ సమీపంలోని నాగూరివాండ్లపల్లెకు చెందిన క్రికెట్ ప్లేయర్ హరిశంకరరెడ్డిని చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో సీఎస్కే జట్టు బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు దక్కించుకుంది. డిగ్రీ వరకు చదువుకున్న ఇతడు బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. (Photo Credit : Instagram)
అండర్-19లో రాష్ట్ర జట్టుకు ఎంపికై 2016 నుంచి ఆడాడు. అనంతరం రంజీ టీమ్‌కు కూడా సెలక్టయ్యాడు. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్ అయిన హరిశంకర్ రెడ్డికి తొలివిడత మినీ ఐపీఎల్ వేలం పాటలోనే సత్తా చాటి.. తన ప్రతిభ ప్రూవ్ చేసుకున్నాడు. 2018 నుంచి ఆంధ్రా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. హరిశంకరరెడ్డి ఐపీఎల్‌కు సెలక్ట్ కావడంపై తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. (Photo Credit : Instagram)
మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అరుదైన అవకాశం మారంరెడ్డికి దక్కినట్టయింది. అతణ్ని బాహుబలిగా అభివర్ణించింది సీఎస్కే టీమ్. అదే పేరుతో ట్వీట్ చేసింది. ఇది వరకు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్‌కు కూడా ఐపీఎల్లో ఆడే అవకాశం లభించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత కడప జిల్లా నుంచే మరో యంగ్ క్రికెటర్ మారంరెడ్డి ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.(Photo Credit : Instagram)