IPL 2023 : శనివారం డబుల్ హెడర్.. అయితే ఒక మ్యాచ్ జరిగేది అనుమానమే.. కారణం ఇదే
IPL 2023 : శనివారం డబుల్ హెడర్.. అయితే ఒక మ్యాచ్ జరిగేది అనుమానమే.. కారణం ఇదే
IPL 2023 : ఇక శనివారం రోజు డబుల్ హెడర్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. మొహాలీ వేదికగా ఈ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.30లకు ఆరంభం కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 2023 సీజన్ ఘనంగా ఆరంభమైంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) టోర్నీలో శుభారంభం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)పై 5 వికెట్ల తేడాతో నెగ్గింది.
2/ 7
ఇక శనివారం రోజు డబుల్ హెడర్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. మొహాలీ వేదికగా ఈ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.30లకు ఆరంభం కానుంది. (PC : Punjab Kings)
3/ 7
ఇక శనివారం జరిగే రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు లక్నో వేదిక కానుంది. మ్యాచ్ రాత్రి గం. 7.30లకు ఆరంభం కానుంది. (PC : Lucknow Super Gaints)
4/ 7
అయితే పంజాబ్ కింగ్స్, కోల్ కతా మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. వాతావరణ నివేదిక ప్రకారం మొహాలీలో శనివారం 3 గంటల నుంచి 7 గంటల మధ్య వర్ష సూచన ఉంది.
5/ 7
అదే జరిగితే పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. లేదంటే ఓవర్లలో కోత పడే అవకాశం ఉంది. ఇది అభిమానులకు నిరాశ అనే చెప్పాలి. 2019 తర్వాత మళ్లీ తొలిసారి ఐపీఎల్ దేశ వ్యాప్తంగా జరుగుతోంది.
6/ 7
దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ విరామం మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదే. దాంతో ఇప్పటికే మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లన్ని హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
7/ 7
ఇక రెండో మ్యాచ్ కు మాత్రం ఎటువంటి వర్ష సూచన లేదు. లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది. రిషభ్ పంత్ ఈ ఐపీఎల్ కు దూరం కాగా.. డేవిడ్ వార్నర్ ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు.