అతనితో పాటు రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రమ్ వంటి ఆటగాళ్లు కూడా పరిశీలించదగిన ప్లేయర్స్. త్రిపాఠికి పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేకపోయినా, అగర్వాల్ గతంలో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే వీరిలో SRH కెప్టెన్‌గా మార్క్రామ్ మంచి ఆప్షన్. అతన్ని సారథిగా ఎందుకు ఎంపిక చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
* దక్షిణాఫ్రికాకు చాలా టైటిల్స్ అందించిన కెప్టెన్ : మార్క్రామ్కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. అంతే కాకుండా 2014లో దక్షిణాఫ్రికాను U-19 ప్రపంచ కప్ టైటిల్ అందించాడు. ఈ టోర్నీలో అద్భుతమైన కెప్టెన్సీతోపాటు విలువైన పరుగులు చేశాడు. ఆరు మ్యాచ్‌లలో 370 పరుగులు చేశాడు. ప్రారంభ SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు కూడా టైటిల్ అందించాడు.
* మంచి ఫామ్‌లో ఉన్న మార్క్రమ్ : సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరఫున మార్క్రమ్ బ్యాట్‌తో మెరిశాడు. ప్రారంభ SA20 లీగ్‌లో 366 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన సెమీ-ఫైనల్లో సంచలన సెంచరీని కొట్టాడు. చాలా కాలంగా మార్క్రమ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అవసరమైనప్పుడు బౌలింగ్ కూడా చేయగలడు.
* దీర్ఘకాలిక అవకాశం కావచ్చు : మార్క్రామ్ ప్రతిభపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అతను ఇప్పుడు మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా జట్టులో కీలక ఆటగాడు. IPLతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న T20 లీగ్‌లలో ఆడిన అనుభవం ఉంది. గత సంవత్సరం IPLలో SRH తరఫున, SA20లో SEC కోసం అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. దీంతో డిసెంబరులో జరిగిన వేలానికి ముందు SRH అతనిని కొనసాగించింది. వయసు రీత్యా కూడా మార్క్రమ్కు చాలా భవిష్యత్తు ఉంది. దీర్ఘకాలంగా జట్టుకు సేవలు అందించే అవకాశం ఉంది.