టోర్నీ ప్రారంభానికి ముందు.. BCCI మరియు NCA అన్ని ఫ్రాంచైజీలను ఆటగాళ్ల పనిభారంపై దృష్టి పెట్టాలని కోరాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ఇప్పటికే కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడని తెలిసింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఈ లిస్ట్ చేరే అవకాశం ఉందని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. విరాట్ కోహ్లీతో పాటు మరికొందరు టీమిండియా ఆటగాళ్లు కూడా ఐపీఎల్ పూర్తి స్థాయిలో ఆడకపోవచ్చు.
ఇక.. జనవరి 1, 2022 నుంచి అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్ల గురించి మాట్లాడితే.. విరాట్ కోహ్లీ గరిష్టంగా 2535 బంతులు ఆడాడు. ఈ సమయంలో కోహ్లీ 50 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కనిపించాడు. టెస్ట్ జట్టులో కోహ్లీ చాలా కీలకం. దీంతో కోహ్లీ కూడా ఆర్సీబీ ఆడే అన్ని మ్యాచుల్లో ఆడకపోవచ్చు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది.
టీమిండియా యంగ్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ 32 మ్యాచ్‌ల్లో 1836 బంతులు, కెప్టెన్ రోహిత్ శర్మ 51 మ్యాచ్‌ల్లో 1595 బంతులు, కేఎల్ రాహుల్ 38 మ్యాచ్‌ల్లో 1441 బంతులు ఆడారు. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ కెప్టెన్‌గా, లక్నో సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా గత టెస్టు సిరీస్‌లో ఆడారు.
లెఫ్టార్మ్ స్పిన్నర్.. ఢిల్లీ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ 45 మ్యాచ్‌ల్లో 1981 , ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 34 మ్యాచ్‌ల్లో 1864 , మహ్మద్ షమీ 25 మ్యాచ్‌ల్లో 1825, ఆల్ రౌండర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 1722 బంతులు వేశారు. ఈ లెక్కన చూస్తే వీళ్లందరికి వర్క్ లోడ్ ఎక్కువైంది. దీంతో.. వీళ్లు పూర్తి స్థాయిలో ఐపీఎల్ మ్యాచులు ఆడకపోవచ్చు.