IPL 2023 : ఐపీఎల్ లో ప్రత్యర్థులుగా తలపడనున్న కవలలు.. రెండు టాప్ టీమ్స్ తరఫున బరిలో.. ఎవరంటే?
IPL 2023 : ఐపీఎల్ లో ప్రత్యర్థులుగా తలపడనున్న కవలలు.. రెండు టాప్ టీమ్స్ తరఫున బరిలో.. ఎవరంటే?
IPL 2023 : ఆరంభపోరుతోనే ఐపీఎల్ కు ఊపు రానుంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
ఐపీఎల్ (IPL 2023) 2023 సీజన్ కోసం రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 16వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది. మార్చి 31న ఆరంభమయ్యే ఐపీఎల్ రెండు నెలల పాటు ప్రేక్షకులను అలరించనుంది.
2/ 8
ఆరంభపోరుతోనే ఐపీఎల్ కు ఊపు రానుంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
3/ 8
ఇక ఈ ఐపీఎల్ లో సౌతాఫ్రికా కవలల మధ్య జరిగే పోరు సీజన్ కే హైలైట్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో బ్రదర్స్ మధ్య పోరు చూశాం.. చూస్తున్నాం. కానీ.. ఈ సీజన్ లో కవలల మధ్య జరిగే ఆసక్తికర పోరు జరగనుంది. (PC : TWITTER)
4/ 8
సౌతాఫ్రికాకు చెందిన మార్కో యాన్సెన్.. డుయాన్ యాన్సెన్ లు కవల పిల్లలు. వీరిద్దరూ మే 1, 2000వ సంవత్సరంలో జన్మించారు. ఇద్దరు చూడటానికి ఒకేలా ఉంటారు. ఒకే విధమైన బౌలింగ్, బ్యాటింగ్ శైలి. (PC : Duan Jansen/Instagram)
5/ 8
మార్కో యాన్సెన్, డుయాన్ యాన్సెన్ ఇద్దరు కూడా లెఫ్టార్మ్ పేసర్లే. ఇద్దరు కూడా బౌలింగ్ ఆల్ రౌండర్లు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్లు. మార్కో యాన్సెన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. (PC : Duan Jansen/Instagram)
6/ 8
ఇక డుయాన్ యాన్సెన్ ను గతేడాది జరిగిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. మార్కో యాన్సెన్ ఇప్పటికే సౌతాఫ్రికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అయితే డుయాన్ మాత్రం ఇంకా చేయలేదు. (PC : Duan Jansen/Instagram)
7/ 8
ఐపీఎల్ 16వ సీజన్ లో రాణించి సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కించుకోవాలని డుయాన్ పట్టుదలగా ఉన్నాడు. ఇక అదే సమయంలో సన్ రైజర్స్ తరఫున మెరుగ్గా రాణించాలని మార్కో యాన్సెన్ ఉన్నాడు. (PC : TWITTER)
8/ 8
ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే పోరులో వీరిద్దరికి ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు దక్కితే తొలిసారి ఒక ఐపీఎల్ మ్యాచ్ లో ట్విన్స్ మధ్య పోరు చూసే అవకాశం ఉంటుంది. (PC : Duan Jansen/Instagram)