IPL 2023 : తొలి మ్యాచ్ లో తుస్సుమన్న లక్నో సూపర్ జెయింట్స్ పోటుగాడు.. ఇలాగైతే కష్టమే
IPL 2023 : తొలి మ్యాచ్ లో తుస్సుమన్న లక్నో సూపర్ జెయింట్స్ పోటుగాడు.. ఇలాగైతే కష్టమే
IPL 2023 : తొలి మ్యాచ్ పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్ల మధ్య జరగింది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ కేకేఆర్ పై అద్బుత విజయాన్ని అందుకుంది. ఇక రాత్రి జరిగిన రెండో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ నెగ్గింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ ఘనంగా ఆరంభమైంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ అభిమానులను సీట్లకు అతుక్కుపోయేలా చేసింది. ఇక శనివారం రోజు జరిగిన డబుల్ హెడర్ అభిమానులకు డబుల్ ధమాకాను అందించింది.
2/ 8
తొలి మ్యాచ్ పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్ల మధ్య జరగింది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ కేకేఆర్ పై అద్బుత విజయాన్ని అందుకుంది. ఇక రాత్రి జరిగిన రెండో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ నెగ్గింది.
3/ 8
లక్నో సూపర్ జెయింట్స్ నెగ్గినా.. కెప్టెన్ ఆటపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తుస్సుమన్నాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు 12 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
4/ 8
ఈ క్రమంలో కేఎల్ రాహుల్ పై మరోసారి విమర్శలు మొదలయ్యాయి. టీమిండియా తరఫున గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేసిన రాహుల్ వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. టెస్టు, టి20, వన్డే ఇలా మూడు ఫార్మాట్లలోనూ కేఎల్ రాహుల్ నిలకడ లేని ఆటను ఆడుతున్నాడు.
5/ 8
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ పేలవ ప్రదర్శన చేసిన అతడు.. చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అయితే ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో మ్యాచ్ విన్నింగ్ ఆట ఆడాడు. దాంతో రాహుల్ ఫామ్ లోకి వచ్చాడని అంతా అనుకున్నారు.
6/ 8
అయితే ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో రాహుల్ తన ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. మరోసారి నిలకడలేని ఆటతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
7/ 8
గత కొంత కాలంగా రాహుల్ తీరు ఇలానే ఉంది. ఒక మ్యాచ్ లో ఆడటం. ఆ తర్వాత వరుసగా విఫలం అవ్వడం. మళ్లీ ఒక మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేయడం. వరుసగా మంచి ప్రదర్శన చేయలేకపోతున్నాడు.
8/ 8
కైల్ మేయర్స్ అద్భుత బ్యాటింగ్ కు మార్క్ వుడ్ బౌలింగ్ తోడవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.