కేకేఆర్ జట్టులో రస్సెల్, సౌతీ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, షకీబుల్ హసన్ రూపంలో మంచి ప్లేయర్లు ఉన్నా.. వీరితో ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టంగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ రెండో అర్ధ భాగానికి రెడీ అయితే కేకేఆర్ రాత మారే అవకాశం ఉంది. లేదంటే టోర్నీలో 10వ స్థానానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది.
మినీ వేలంలో వెర్రిగా ఖర్చు పెట్టిన పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా ఏ మాత్రం బాగాలేదు. శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. భానుక రాజపక్స, లివింగ్ స్టోన్, బెయిర్ స్టో, షారుఖ్ ఖాన్, స్యామ్ కరణ్ రూపంలో పవర్ హిట్టర్స్ ఉన్నా.. వీరంతా సమష్టిగా ఏ మేరకు రాణిస్తారో చూడాలి. పంజాబ్ కూడా 9 లేదా 10వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది.