IPL 2023 : డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ టైటిల్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతున్నాయి. ఇక నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్.. రాజస్తాన్ రాయల్స్ జట్లు కూడా టఫ్ ఫైట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 2023 సీజన్ ఆరంభం కావడానికి వారం కంటే తక్కువ రోజుల సమయమే ఉంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదిగా ఐపీఎల్ 16వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది.
2/ 8
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ టైటిల్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతున్నాయి. ఇక నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్.. రాజస్తాన్ రాయల్స్ జట్లు కూడా టఫ్ ఫైట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
3/ 8
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు బడా టీమ్స్ అనే ట్యాగ్ ఉంది. ఎందుకంటే ఈ రెండు జట్లు కలిసి ఐపీఎల్ టైటిల్ ను ఏకంగా 9 సార్లు సొంతం చేసుకుంది. ప్రతి సీజన్ లోనూ బెస్ట్ ఇవ్వడంలో ఈ రెండు జట్ల తర్వాతే ఏవైనా
4/ 8
అయితే ఈ రెండు జట్లకు డార్క్ హార్స్ గా బరిలోకి దిగుతున్న ఒక జట్టు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆ జట్టే సన్ రైజర్స్ హైదరాబాద్. గత రెండు సీజన్లలో తేలిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ ఏడాది మాత్రం సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
5/ 8
ఎవరూ కూడా సన్ రైజర్స్ ను ఈ ఏడాది ఐపీఎల్ లో ఫేవరెట్ గా పేర్కొనడం లేదు. అంతేకాకుండా పెద్దగా అంచనాలు కూడా సన్ రైజర్స్ పై లేవు. ఇదే ఇప్పుడు సన్ రైజర్స్ కు వరంగా మారనుంది. కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వంలో సంచలనం నమోదు చేసేందుకు సన్ రైజర్స్ రెడీగా ఉంది.
6/ 8
ఈసారి సన్ రైజర్స్ బ్యాటింగ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. రోహిత్, ధోని, కోహ్లీ, రాహుల్, వార్నర్ లాంటి స్టార్ ప్లేయర్లు లేకపోయినా.. అవకాశం దొరికితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే ప్లేయర్స్ సన్ రైజర్స్ లో ఉన్నారు.
7/ 8
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, మార్క్రమ్, క్లాసెన్, వాషింగ్టన్ సుందర్ రూపంలో స్పిన్, పేస్ ను సమర్థంగా ఆడే ప్లేయర్లు జట్టులో ఉన్నారు. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్ లతో పటిష్టంగా కనిపిస్తోంది.
8/ 8
అవసరం అయితే మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్ లు బౌలింగ్ చేయగలరు. ఇటీవలె ముగిసిన సౌతాఫ్రికా 20 లీగ్ లో మార్క్రమ్ 13 వికెట్లతో సత్తా చాటాడు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇతర జట్లకు షాకిచ్చి ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం కూడా ఉంది.