ఇక ఆ ఏడాది ఒక మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజులో ఉన్న ధోని తన మార్కు బ్యాటింగ్ తో జట్టును గెలిపించాడని గావస్కర్ గుర్తు చేశాడు. కష్ట సమయాల్లో కెప్టెన్ హోదాలో ధోని ముందుండి నడిపించడంతో ఇతర ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. అందుకే ఆ ఏడాది చెన్నై మరోసారి చాంపియన్ గా నిలిచిందంటూ గావస్కర్ పేర్కొన్నాడు.