సన్ రైజర్స్ హైదరాబాద్ కు 2016లో ఐపీఎల్ టైటిల్ అందించి మ్యాచ్ విన్నర్ ముద్రను వేసుకున్న డేవిడ్ వార్నర్.. ఒక్క మ్యాచ్ తో లూజర్ గా మారిపోయాడు. ఢిల్లీ అభిమానులు వార్నర్ ను మెచ్చుకోవాలంటే త్వరలో జట్టును గెలుపు బాట పట్టించాల్సి ఉంది. లేదంటే వార్నర్ పై ఢిల్లీ అభిమానులు తిట్ల దండకాన్ని షురూ చేసే అవకాశం లేకపోలేదు.