IPL 2023 : టి20 చిచ్చర పిడుగులు.. ఆడితే పరుగుల వరద ఖాయం.. అయినా తుది జట్టులో చోటు దక్కేది కష్టమే
IPL 2023 : టి20 చిచ్చర పిడుగులు.. ఆడితే పరుగుల వరద ఖాయం.. అయినా తుది జట్టులో చోటు దక్కేది కష్టమే
IPL 2023 : 120 బంతుల పాటు సాగే ఇన్నింగ్స్ లో పరుగులు చేయడమే లక్ష్యంగా ప్లేయర్లు బరిలోకి దిగుతారు. ఆరంభం నుంచే భారీ షాట్లకు వెళతారు. ఇక ముంబై ఇండియన్స్ లో పవర్ హిట్టర్లకు ఏ లోటూ లేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు ధనాధన్ లీగ్.. మెరుపుల లీగ్ అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. టి20 ఫార్మాట్ లో ఎక్కువగా బ్యాటర్లదే డామినేషన్. బౌలర్లు ఎప్పుడో కానీ మెరవరు. అందుకే టి20 ఫార్మాట్ కు విపరీతమైన క్రేజ్.
2/ 8
120 బంతుల పాటు సాగే ఇన్నింగ్స్ లో పరుగులు చేయడమే లక్ష్యంగా ప్లేయర్లు బరిలోకి దిగుతారు. ఆరంభం నుంచే భారీ షాట్లకు వెళతారు. ఇక ముంబై ఇండియన్స్ లో పవర్ హిట్టర్లకు ఏ లోటూ లేదు.
3/ 8
రోహిత్ శర్మ, గ్రీన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ రూపంలో భారీ బ్యాటింగ్ లైపన్ ముంబై ఇండియన్స్ సొంతం. వీరితో పాటు మరో ఇద్దరు చిచ్చర పిడుగులు జట్టులో ఉన్నారు.
4/ 8
వారే డివాల్డ్ బ్రేవిస్.. స్టబ్స్. వీరిద్దరూ సౌతాఫ్రికాకు చెందిన ప్లేయర్లే. వీరు ఆడితే పరుగుల వరద పారడం ఖాయం. 200కు పైగా స్ట్రయిక్ రేట్ తో పరుగులు చేయడంలో వీరికి వీరే సాటి. బ్రేవిస్ ను బేబీ ఏబీగా కూడా పిలుస్తారు.
5/ 8
గత సీజన్ లో బ్రేవిస్ సూపర్ బ్యాటింగ్ తో మెరిశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ రాహుల్ చహర్ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లు ఇప్పటికీ అభిమానులకు గుర్తే. స్టబ్స్ విషయానికి వస్తే గత సీజన్ లో అతడికి ఆడే అవకాశం రాలేదు. కానీ సౌతాఫ్రికా తరఫున లోయర్ ఆర్డర్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడాడు.
6/ 8
అయితే ఈ ఐపీఎల్ లో వీరికి తుది జట్టులో చోటు దక్కేది అనుమానంగానే ఉంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే ఆడాల్సి ఉంది. గ్రీన్, టిమ్ డేవిడ్, ఆర్చర్, బెహ్రాండార్ఫ్ రూపంలో నాలుగు విదేశీ స్థానాలు ఫిక్స్ అయిపోయాయి.
7/ 8
ఈ క్రమంలో బ్రేవిస్, స్టబ్స్ లకు ముంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తుంది. టిమ్ డేవిడ్ విఫలం అయితే అప్పుడు అతడి స్థానంలో వీరిద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
8/ 8
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ వేటను ఏప్రిల్ 2న ఆరంభించనుంది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఆరంభమయ్యే మ్యాచ్ లో ఆర్సీబీతో ముంబై జట్టు తలపడనుంది.