చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. అయితే ఓపెనర్‌గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసి అదరగొట్టడంతో సీఎస్కే, 178 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది... ఐపీఎల్ 2023 సీజన్లో మొదటి పరుగు, మొదటి బౌండరీ, మొదటి సిక్సర్, మొదటి హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్..
గిల్ కూడా రుతురాజ్ మాదిరే తన క్లాసీ షాట్లతో అలరించాడు. శుబ్‌మన్ గిల్ స్పిన్, పేస్ బౌలింగ్‌లోనూ అద్భుతంగా పరుగులు చేయగలడు. ఇప్పటికే తన సత్తా గురించి క్రికెట్ ప్రపంచానికి తెలిపాడు. గత మూడు నెలల్లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు గిల్. టీ20, టెస్టు, వన్డే.. ఫార్మాట్ ఏదైనా సెంచరీలతో చెలరేగుతున్నాడు. ఈ మూడు ఫార్మాట్లలో కూడా సెంచరీలు చేశాడు.