IPL 2023కి ముందు.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తన కెప్టెన్‌ను సోమవారం ప్రకటించింది. నితీష్ రాణాకు కేకేఆర్ కమాండ్ ఇచ్చారు. గాయం కారణంగా మొత్తం టోర్నీలో రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆడడం సాధ్యం కాదు. దీంతో కెప్టెన్సీ బాధ్యతల్ని అనుభవజ్ఞుడైన నితీష్ రాణాకి అప్పగించింది కేకేఆర్ ఫ్రాంచైజీ. (Nitish Rana/Instagram)
ఇండియా-ఇంగ్లండ్ సిరీస్‌లో అయ్యర్ భుజం గాయంతో బాధపడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2022 నుంచి తప్పుకున్నాడు. తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ శ్రేయస్ స్థానంలో రిషబ్ పంత్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2020 ఐపీఎల్ లో పైనల్ కి చేరుకుంది. కానీ.. ముంబై చేతిలో ఓడిపోయింది. (Twitter/IPL)
గాయం నుంచి కోలుకున్న తర్వాత... రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కొనసాగుతాడని ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. IPL 2022 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి విడుదల అయ్యాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ అయ్యర్‌ను రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. (Twitter/IPL)