తనకు ఒంటిపై పచ్చబోట్టు (టాటూస్) వేసుకోవడం చిన్నప్పటి నుంచి ఇష్టమని ధావన్ తెలిపాడు. ఈ క్రమంలో ఓసారి తన పేరెంట్స్ కు తెలియకుండా టాటూ వేసుకున్నానని తెలిపాడు. ఇది తెలుసుకున్న తన తండ్రి చితక్కొట్టాడని తెలిపాడు. టాటూల వల్ల లేని పోనీ రోగాలు వస్తాయని, హెచ్ఐవీ టెస్ట్ కూడా చేయించాడని గుర్తు చేసుకున్నాడు.
‘టీనేజ్ లో ఎవరికీ తెలియకుండా వీపు మీద టాటూ వేయించుకున్నాను. కొన్ని రోజుల పాటు నేను టాటూ వెయించుకున్నట్లు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. 3-4 నెలలు గడిచిన తర్వాత ఓ రోజు వీపు మీద ఉన్న టూటూను మా నాన్న చూశాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన చితక్కొట్టాడు. టాటూల వల్ల లేని పోని రోగాలు వస్తాయని భయపెట్టాడు. ఆయన మాటలతో నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకంటే.. నాకు టాటూ వేసిన సూదీతోనే.. ఇంకా ఎందరికి టాటూ వేసి ఉంటారో నాకు తెలియదు కదా. అందుకే నాలోనూ కాస్త భయం ప్రారంభమైంది. నేను భయపడుతున్నది తెలుసుకున్న మా నాన్న నాకు హెచ్ఐవీ టెస్ట్ చేయించారు. అదృష్టవశాత్తు నెగటివ్ వచ్చింది’ అని ధావన్ టీనేజ్ విషయాలను గుర్తు చేసుకున్నాడు.