గతేడాది ఐపీఎల్ ఆరంభానికి సరిగ్గా 10 రోజుల ముందు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలను అందజేశారు. అనంతరం జడేజా కెప్టెన్ గా జట్టుకు విజయాలను అందించలేకపోయాడు. దాంతో సగం మ్యాచ్ ల తర్వాత అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దాంతో ధోని మరోసారి కెప్టెన్ గా వ్యవహరించాడు.