ఒకవేళ మార్కరమ్ కు కాకుంటే గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతేడాది మయాంక్ అగర్వాల్ కెప్టెన్ గా ఫర్వాలేదనిపించాడు. అయితే బ్యాటింగ్ లో మాత్రం విఫలం అయ్యాడు. పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలో నిలిచింది.