IPL 2023 : ఆ విషయంలో పోటా పోటీగా రోహిత్, ధోని.. పాపం కోహ్లీ అడ్రస్సే గల్లంతు
IPL 2023 : ఆ విషయంలో పోటా పోటీగా రోహిత్, ధోని.. పాపం కోహ్లీ అడ్రస్సే గల్లంతు
IPL 2023 : మే 28 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ అభిమానులను అలరించడం ఖాయం. ఇంపాక్ట్ రూల్ రూపంలో కొత్త నిబంధనను తొలిసారి ఐపీఎల్ లో వాడనున్నారు. దాంతో మ్యాచ్ లు మరింత రసవత్తరంగా మారనున్నాయి.
ఈ నెల 31న ధనాధన్ లీగ్ ఐపీఎల్ (IPL) 16వ సీజన్ మొదలు కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తలపడనుంది.
2/ 8
మే 28 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ అభిమానులను అలరించడం ఖాయం. ఇంపాక్ట్ రూల్ రూపంలో కొత్త నిబంధనను తొలిసారి ఐపీఎల్ లో వాడనున్నారు. దాంతో మ్యాచ్ లు మరింత రసవత్తరంగా మారనున్నాయి.
3/ 8
ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్స్ గా ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్.. నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్.. రాయల్ చాలెంజర్స్ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టులోనూ ఐకాన్ ప్లేయర్ ఉన్నాడు. ముంబైకి రోహిత్.. చెన్నైకి ధోని.. ఆర్సీబీకి కోహ్లీ రూపంలో ఒక్కో జట్టుకు ఒక్కో స్టార్ ప్లేయర్ ఉన్నాడు.
4/ 8
అయితే ఒక విషయంలో అటు ముంబై, ఇటు చెన్నై తీవ్రంగా పోటీ పడుతుంది. అయితే అది టైటిల్స్ విషయం మాత్రం కాదు. ఐపీఎల్ ఆరంభం నుంచి కూడా ఈ రెండు జట్లు ఉన్నాయి. అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచేందుకు అటు ముంబై, ఇటు చెన్నై మధ్య తీవ్ర పోటీ ఉంది.
5/ 8
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 231 మ్యాచ్ లు ఆడితే అందులో 131 సార్లు ముంబై గెలిచింది. 99 సార్లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దయింది. ప్రస్తుతానికి అయితే ముంబై జట్టే అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఉంది.
6/ 8
ఇక రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 209 మ్యాచ్ ల్లో 121 సార్లు చెన్నై గెలిచింది. 87 సార్లు ఓడిపోయింది. మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. 121 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది.
7/ 8
అయితే ఈ విజయాల రికార్డులో మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వెనుకబడి ఉంది. 228 మ్యాచ్ ల్లో కేవలం 109 సార్లు మాత్రమే గెలిచింది. 114 సార్లు ఓడిపోయింది. మరో ఐదు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు.
8/ 8
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో ఉండటం విశేషం. మూడో స్థానంలో 114 విజయాలతో కోల్ కతా నైట్ రైడర్స్ ఉండటం విశేషం.