ఒక సీజన్ లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ గా కోహ్లీ ఉన్నాడు. 2016 ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ ఏకంగా నాలుగు సెంచరీలు బాదాడు. టి20 ఫార్మాట్ లో ఒక సెంచరీ బాదితేనే గొప్పగా భావిస్తారు. అటువంటిది ఒకే సీజన్ లో నాలుగు సెంచరీలు బాదడం అంటే అంత మామూలు విషయం కాదు. కోహ్లీ సెట్ చేసిన ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు.
2016 ఐపీఎల్లో భాగంగా గుజరాత్ లయన్స్‌పై విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లు సూపర్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు కలిసి 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. ఈ మ్యాచ్‌లో ఇద్దరు కూడా సెంచరీలు బాదడం విశేషం. వీరిద్దరూ కలిసి నెలకొల్పిన 229 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.