హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 2022 సీజన్ ద్వారా ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చింది. అరంగేట్రం చేసిన తొలి సీజన్ లోనే టైటిల్ ను ఖాయం చేసుకుని సత్తా చాటింది.
2/ 8
ఎటువంటి అంచనాలు లేకుండా గుజరాత్ టైటాన్స్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ చాంపియన్ గా నిలిచింది. సీజన్ ఆరంభానికి ముందు హార్దిక్ పాండ్యా కెప్టెనా? అన్న వారే ఆ తర్వాత అతడికి జైజైలు పలికారు. అచ్చం అలానే 2023 ఐపీఎల్ లో అదరగొట్టేందుకు కొందరు ప్లేయర్లు సిద్ధమయ్యారు.
3/ 8
వీరు గతేడాది డిసెంబర్ లో జరిగిన మినీ వేలంలో భారీ రేటు దక్కించుకోలేదు. కానీ, పుష్కలంగా ట్యాలెంట్ ఉన్న ప్లేయర్స్. మార్చి 31న ఆరంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ లో రెచ్చిపోవాలనే ఉద్దేశంలో వీరున్నారు.
4/ 8
ఈ జాబితాలో ఐర్లాండ్ కు చెందిన జాషువా లిటిల్ ఉన్నాడు. వేలంలో ఇతడిని రూ. 4.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. గతేడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టి20 ప్రపంచకప్ 2022లో కూడా అదరగొట్టాడు.
5/ 8
కర్ణాటకకు చెందిన పేసర్ విద్వాత్ కవెరప్పను రూ. 20 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. 23 ఏళ్ల కవెరప్ప గతేడాది దేశవాళి క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ముఖ్యంగా టి20ల్లో అదరగొట్టాడు. 8 మ్యాచ్ ల్లో 18 వికెట్లు తీశాడు. ఇతడు 2023 ఐపీఎల్ తర్వాత స్టార్ ప్లేయర్ గా మారే అవకాశం ఉంది.
6/ 8
నారాయణ్ జగదీశన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 90 లక్షలకు సొంతం చేసుకుంది. గతేడాది జరిగిన దేశవాళి వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో జగదీశన్ రెచ్చిపోయి ఆడాడు. వరుసగా 5 సెంచరీలు బాదాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇతడిపై కూడా ఒక కన్నేసి ఉంచండి.
7/ 8
ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ తో పాటు ఇటీవలె ముగిసిన సౌతాఫ్రికా 20లీగ్ లో కూడా రషీద్ మంచి ప్రదర్శన కనబరిచాడు. మిడిల్ ఓవర్స్ లో పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీయడంలో రషీద్ దిట్ట.
8/ 8
ఇక ఐపీఎల్ 2023 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. హోం, అవే పద్దతిన దేశంలోని 12 వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.