IPL 2023 : ఆర్సీబీ బలం.. బలహీనత ఈ ఐదుగురు ప్లేయర్సే.. వీరు ఆడితే ప్రత్యర్థి జట్లకు చుక్కలే
IPL 2023 : ఆర్సీబీ బలం.. బలహీనత ఈ ఐదుగురు ప్లేయర్సే.. వీరు ఆడితే ప్రత్యర్థి జట్లకు చుక్కలే
IPL 2023 : ఐపీఎల్ 2023 సీజన్ మొత్తం 12 వేదికల్లో జరగనుంది. సొంత మైదానంలో సగం మ్యాచ్ లు ఆడుతుండటం ప్రతి జట్టుకు కూడా కలిసివచ్చే అంశం. ఇక ఇప్పటికే 10 జట్లు కూడా సన్నాహక శిబిరాలను స్టార్ట్ చేశాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ ఆరంభానికి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా మార్చి 31న జరిగే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మ్యాచ్ తో ఐపీఎల్ 16వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది.
2/ 10
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మళ్లీ పాత పద్ధతిలోనే జరగనుంది. కరోనా కారణంగా గత మూడు సీజన్ లు హోం, అవే పద్ధతిన జరగలేదు. అయితే ఈసారి మాత్రం ఎప్పటిలానే హోం, అవే పద్ధతిన జరగనున్నాయి.
3/ 10
ఐపీఎల్ 2023 సీజన్ మొత్తం 12 వేదికల్లో జరగనుంది. సొంత మైదానంలో సగం మ్యాచ్ లు ఆడుతుండటం ప్రతి జట్టుకు కూడా కలిసివచ్చే అంశం. ఇక ఇప్పటికే 10 జట్లు కూడా సన్నాహక శిబిరాలను స్టార్ట్ చేశాయి.
4/ 10
తొలి సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్నా ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్పును అందుకోలేకపోయింది. ప్రతి ఏడాది హాట్ ఫేవరెట్ గా లీగ్ లో ఆడుగెపెట్టడం రిక్త హస్తాలతో ఇంటిదారి పట్టడం ఆర్సీబీ జట్టుకు అలవాటుగా మారింది. అయితే ఈసారి మాత్రం కప్పు తప్పకుండా నెగ్గాలనే పట్టుదల మీద ఆర్సీబీ కనిపిస్తుంది.
5/ 10
ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు విజయాల్లో ఐదుగురు పాత్ర కీలకంగా మారనుంది. వీరే జట్టుకు బలం.. అదే సమయంలో బలహీనతగా మారే అవకాశం ఉంది. ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
6/ 10
ఈ జాబితాలో కింగ్ విరాట్ కోహ్లీ మొదట ఉన్నాడు. గత సీజన్ లో పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడ్డాడు. అయితే ప్రస్తుతం కోహ్లీ మళ్లీ టచ్ లోకి వచ్చాడు. ఈసారి ఎలాగైనా పరుగుల వరద పారించి తన జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ ను అందించాలనే పట్టుదల మీద కోహ్లీ ఉన్నాడు.
7/ 10
గత సీజన్ లో జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన ఫాఫ్ డు ప్లెసిస్ ఫర్వాలేదనిపించాడు. తన జట్టును ప్లే ఆఫ్స్ వరకు నడిపించాడు. ఓపెనర్ గా కెప్టెన్ గా డు ప్లెసిస్ మెరుగైన ప్రదర్శనే చేశాడు. ఈ సీజన్ లో మరింతగా రెచ్చిపోవాలని పట్టుదలతో ఉన్నాడు.
8/ 10
ఆకాశమే హద్దుగా చెలరేగడంలో గ్లెన్ మ్యాక్స్ వెల్ తర్వాతే ఎవరైనా.. అయితే గత కొంత కాలంగా మ్యాక్సీ ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అయితే టి20 స్పెషలిస్టుగా ఉన్న అతడు మిడిల్ ఓవర్లలో రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ లలో కూడా మ్యాక్స్ వెల్ అక్కరకు వస్తాడు.
9/ 10
గత సీజన్ లో ఆర్సీబీ ఫినిషర్ గా దినేశ్ కార్తీక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కార్తీక్.. ధనాధన్ బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. ఓడిపోయే మ్యాచ్ లను గెలిపించాడు. ఈసారి కూడా కార్తీక్ మెరుపులు మెరిపించాలని పట్టుదలగా ఉన్నాడు.
10/ 10
ఈ జాబితాలో చివరగా శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగ ఉన్నాడు. గత సీజన్ లో అత్యధిక వికెట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. బంతితో మాయ చేయడంలో హసరంగ దిట్ట. బ్యాట్ తో కూడా రాణించడగలడు. ప్రతి మ్యాచ్ లో ఈ ఐదుగురిలో కనీసం ముగ్గురు చొప్పున మెరిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం సులభం.