IPL 2023 : వామ్మో.. పొగిడితే ఇంత ప్రమాదమా? పాపం ఆ SRH ప్లేయర్ కు దిష్టి తగిలినట్లుంది..అందుకే ఇలా
IPL 2023 : వామ్మో.. పొగిడితే ఇంత ప్రమాదమా? పాపం ఆ SRH ప్లేయర్ కు దిష్టి తగిలినట్లుంది..అందుకే ఇలా
IPL 2023 : ఇంగ్లండ్ పవర్ హిట్టర్ గా ఉన్న బ్రూక్ 2022లోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2022 జనవరిలో వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ ద్వారా ఇంగ్లండ్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు.
గతేడాది జరిగిన ఐపీఎల్ (IPL) మినీ వేలంలో ఇంగ్లండ్ (England) కు చెందిన హ్యారీ బ్రూక్ (Harry Brook)ను రూ. 13.25 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
2/ 8
ఇంగ్లండ్ పవర్ హిట్టర్ గా ఉన్న బ్రూక్ 2022లోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2022 జనవరిలో వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ ద్వారా ఇంగ్లండ్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు.
3/ 8
అనంతరం టెస్టు, వన్డేల్లో కూడా డెబ్యూ చేసేశాడు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ నుంచి ఇప్పటి వరకు సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్రూక్ ను భారీ ధర పెట్టి సన్ రైజర్స్ సొంతం చేసుకుంది.
4/ 8
ఇక న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్రూక్ 186 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో అతడిని సన్ రైజర్స్ అభిమానులు విపరీతంగా పొగుడ్తూ హల్చల్ చేశారు.
5/ 8
అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం బ్రూక్ ఒక్క బంతి కూడా ఫేస్ చేయకుండానే డైమండ్ డక్ అయ్యాడు. జో రూట్ తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో హీరోగా ఉన్న బ్రూక్ రెండో ఇన్నింగ్స్ లో జీరో అయ్యాడు.
6/ 8
దాంతో సన్ రైజర్స్ అభిమానులు బ్రూక్ కు దిష్టి తగిలిందని కామెంట్స్ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో కదం తొక్కడంతో చేసిన పొగడ్తలు అతడికి దిష్టిని తగిలేలా చేశాయని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
7/ 8
ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో నెగ్గింది. దాంతో సిరీస్ సమం అయ్యింది. 258 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 256 పరుగులకు కుప్పకూలింది.
8/ 8
జో రూట్ (113 బంతుల్లో 95; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. జో రూట్ ను రాజస్తాన్ రాయల్స్ కోటి రూపాయలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.