IPL 2023 : 24 ఫోర్లు.. 5 సిక్సర్లతో 184 పరుగులు.. ప్రత్యర్థి బౌలర్లను రఫ్పాడించిన SRH పవర్ హిట్టర్
IPL 2023 : 24 ఫోర్లు.. 5 సిక్సర్లతో 184 పరుగులు.. ప్రత్యర్థి బౌలర్లను రఫ్పాడించిన SRH పవర్ హిట్టర్
IPL 2023 : అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు కొత్త కెప్టెన్ ఎవరో ప్రకటించేసింది. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా 20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ను చాంపియన్ గా నిలిపిన మార్కరమ్ కు కెప్టెన్సీ బాధ్యతలను ఇచ్చింది.
ధనాధన్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ కు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మార్చి 31 నుంచి మే 28 మధ్య ఐపీఎల్ 16వ సీజన్ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ (BCCI) విడుదల చేసింది.
2/ 8
అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు కొత్త కెప్టెన్ ఎవరో ప్రకటించేసింది. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా 20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ను చాంపియన్ గా నిలిపిన మార్కరమ్ కు కెప్టెన్సీ బాధ్యతలను ఇచ్చింది.
3/ 8
ఇక తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ హ్యారీ బ్రూక్ న్యూజిలాండ్ పై చెలరేగిపోయాడు. 24 ఫోర్లు, 5 సిక్సర్లతో బౌండరీల వర్షం కురిపించాడు.
4/ 8
కివీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 169 బంతుల్లోనే 184 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 315 పరుగులు చేసింది.
5/ 8
ఐపీఎల్ కు ముందు బ్రూక్ ఈ రేంజ్ లో చెలరేగడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు సానుకూల అంశం. గతేడాది డిసెంబర్ లో జరిగిన మినీ వేలంలో బ్రూక్ ను రూ.13.25 కట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది.
6/ 8
బ్రూక్ ఇతర ఇంగ్లండ్ ప్లేయర్లలా కాదు. స్పిన్ ను ఆడటంలో దిట్ట. అందుకే ఉపఖండ పిచ్ లలో బ్రూక్ చెలరేగుతున్నాడు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ కు ముందు పాకిస్తాన్ లో పర్యటిస్తూ బౌలర్లను రఫ్పాడించాడు.
7/ 8
తాజాగా కివీస్ బౌలర్ల భరతం పడుతున్నాడు. ఇదే రేంజ్ లో బ్రూక్ ఐపీఎల్ లో ఆడితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగుండదు. మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, బ్రూక్, వాషింగ్టన్ సుందర్ లతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది.
8/ 8
ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ లు నిప్పులు చెరిగేందుకు రెడీగా ఉన్నారు. వీరితో పాటు యాన్సెన్, ఫరూఖీలు కూడా రెడీగా ఉన్నారు. రషీద్ స్పిన్ విభాగంలో టీం బాధ్యతలు మోయనున్నాడు.