గత సీజన్ లో 16 మ్యాచ్ ల్లో 26 వికెట్లు కూడా తీశాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. విదేశీ ప్లేయర్లు ఐపీఎల్ ఆడాలంటే తమ దేశ క్రికెట్ బోర్డుల నుంచి NOC (No Objection Certificate) పొందాల్సి ఉంటుంద. అయితే దీని విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు జాప్యం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో హసరంగను టెస్టు సిరీస్ కోసం శ్రీలంక ఎంపిక చేసింది. అంతేకాకుండా దేశవాళి క్రికెట్ పై ఫోకస్ పెట్టాలని కూడా సూచించినట్లు తెలుస్తుంది. ఇక కివీస్ పర్యటన ఏప్రిల్ 8 వరకు జరగనుంది. ఆ పర్యటన తర్వాత శ్రీలంక షెడ్యూల్ ను ఇంకా ప్రకటించలేదు. కివీస్ పర్యటన తర్వాత హసరంగకు శ్రీలంక క్రికెట్ బోర్డు NOC ఇస్తుందో లేదో చూడాలి.