IPL 2023 : పాకిస్తాన్ సూపర్ లీగ్ లో సికిందర్ రాజా లాహోర్ ఖలండర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. క్వెటా గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్ లో సికిందర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2023) 2023లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఆల్ రౌండర్ సికిందర్ రాజా (Sikandar Raza) రెచ్చిపోయాడు. సునామీ లాంటి ఇన్నింగ్స్ తో తన జట్టును గెలిపించాడు. (PC : TWITTER)
2/ 7
పాకిస్తాన్ సూపర్ లీగ్ లో సికిందర్ రాజా లాహోర్ ఖలండర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. క్వెటా గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్ లో సికిందర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. (PC : TWITTER)
3/ 7
34 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. దాంతో లాహోర్ జట్టు 148 పరుగులు చేసింది. బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం అంటే గొప్ప విషయమే. (PC : TWITTER)
4/ 7
అనంతరం గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసింది. హారీస్ రవూఫ్ 3 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ రెండు వికెట్లతో మెరిశాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో లాహోర్ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. (PC : TWITTER)
5/ 7
గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సికిందర్ రాజాను రూ 50 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో సికిందర్ రాజా అద్భుతంగా ఆడుతున్నాడు. (PC : TWITTER)
6/ 7
బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడంతో పాటు బౌలింగ్ లో కూడా అక్కరకు వస్తున్నాడు. ఇటువంటి ఆల్ రౌండర్ ను రూ.50 లక్షలకు సొంతం చేసుకుని పంజాబ్ మంచి పని చేసింది. (PC : TWITTER)
7/ 7
ఇక ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31న ఆరంభం కానుంది. కరోనాకు ముందు లాగే హొమ్, అవే పద్ధతిలో మ్యాచ్ లు జరగనున్నాయి. మే 28న జరిగే ఫైనల్ జరగనుంది. (PC : TWITTER)