కేన్ విలియమ్సన్ 92 టెస్టుల్లో 7,787 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కివీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్న రాస్ టేలర్ (7,683)ను కేన్ మామ వెనక్కి నెట్టాడు. కేన్ తన టెస్టు కెరీర్ లో 26 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 53.33గా ఉండటం విశేషం.