ఈ విషయంలో ఓనర్ కావ్య మారన్ కు ఇప్పటికే ఒక ఐడియా వచ్చిందని సమాచారం. సౌతాఫ్రికా ప్లేయర్ మార్కరమ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా చేయాలనే ఆలోచనలో కావ్య మారన్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌతాఫ్రికా టి20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు కెప్టెన్ గా వ్యవహిరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ టోర్నీ ఆఖరి స్టేజ్ కు చేరుకోగా.. ఈస్టర్న్ కేప్ ను మార్కరమ్ సెమీస్ కు చేర్చాడు.