IPL 2023 : ఇంగ్లండ్ ప్లేయర్లు హ్యాండిస్తే ఈ ఐపీఎల్ టీం ఆగం ఆగం కావాల్సిందే
IPL 2023 : ఇంగ్లండ్ ప్లేయర్లు హ్యాండిస్తే ఈ ఐపీఎల్ టీం ఆగం ఆగం కావాల్సిందే
IPL 2023 : ఐపీఎల్ 2023వ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కోల్ కతా వేదికగా ట్రైనింగ్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ఇతర జట్టు కూడా మార్చి నెలలో ట్రైనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL) ఆరంభానికి ఎంతో సమయం లేదు. అహ్మదాబాద్ వేదికగా మార్చి 31న జరిగే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మ్యాచ్ తో ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభం కానుంది.
2/ 8
ఐపీఎల్ 2023వ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కోల్ కతా వేదికగా ట్రైనింగ్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ఇతర జట్టు కూడా మార్చి నెలలో ట్రైనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
3/ 8
అయితే మొన్నటికి మొన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఒక బాంబు పేల్చాడు. ఐపీఎల్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్ లకు తాను అందుబాటులో ఉండేది అనుమానమే అంటూ అందరికీ షాకిచ్చాడు.
4/ 8
ఈ ఏడాది జూన్ 16 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ జరగనుంది. యాషెస్ సిరీస్ ను ఈ రెండు జట్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈ క్రమంలో మే చివరి నుంచి ఇంగ్లండ్ సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. (PC : England Cricket)
5/ 8
ఈ క్రమంలో ఐపీఎల్ లో ఆడుతున్న పలువురు ఇంగ్లండ్ ప్లేయర్స్ లీగ్ ను మధ్యలోనే వదిలి వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే పంజాబ్ కింగ్స్ జట్టు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ లో పేర్కొన్నాడు.
6/ 8
గతేడాది జరిగిన మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో రూ. 18.5 కోట్లు పెట్టి స్యామ్ కరణ్ ను కొనుగోలు చేసింది. ఇక కరణ్ తో పాటు లియామ్ లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టోలు పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
7/ 8
యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు ఈ ముగ్గురు కూడా ఐపీఎల్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అది కూడా కీలకమైన ఆఖరి దశలో.. దాంతో పంజాబ్ కింగ్స్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
8/ 8
పంజాబ్ కింగ్స్ 2008, 2014 సీజన్లలో మినహా పెద్దగా రాణించలేదు. ఈ రెండు సీజన్లను తప్పించి ఆ జట్టు గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది కూడా ఏమీ లేదు. ఇక ఈ సీజన్ లో శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.