IPL 2023 : సంజూ సామ్సన్ టీంకు బిగ్ షాక్.. గాయంతో రూ. 10 కోట్ల ప్లేయర్ ఐపీఎల్ 2023 నుంచి అవుట్
IPL 2023 : సంజూ సామ్సన్ టీంకు బిగ్ షాక్.. గాయంతో రూ. 10 కోట్ల ప్లేయర్ ఐపీఎల్ 2023 నుంచి అవుట్
IPL 2023 : ఈ సీజన్ ఆరంభానికి ముందే సంజూ సామ్సన్ (Sanju Samson) నాయకత్వంలోని రాజస్తాన్ రాయల్స్ (Rajasthan royals) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక బౌలర్ గాయంతో సీజన్ మొత్తానికే తప్పుకున్నాడు.
ఐపీఎల్ (IPL) 2023 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. హోం, అవే పద్దతిన దేశంలోని 12 వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
2/ 7
ఈ సీజన్ ఆరంభానికి ముందే సంజూ సామ్సన్ (Sanju Samson) నాయకత్వంలోని రాజస్తాన్ రాయల్స్ (Rajasthan royals) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక బౌలర్ గాయంతో సీజన్ మొత్తానికే తప్పుకున్నాడు.
3/ 7
ఆ జట్టు స్టార్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ గత కొంత కాలంగా బ్యాక్ ఇంజూరితో బాధ పడుతున్నాడు. చివరిసారిగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ లో ఆడిన అతడు అనంతరం మళ్లీ క్రికెట్ ఆడలేదు. (PC : TWITTER)
4/ 7
అయితే ఐపీఎల్ 2023 నాటికి కోలుకుంటాడని రాజస్తాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ భావించింది. అయితే అతడి గాయం తీవ్రత ఏ మాత్రం తగ్గకపోవడంతో అతడు సీజన్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడని రాజస్తాన్ మేనేజ్ మెంట్ పేర్కొంది. (PC : TWITTER)
5/ 7
2022 మెగా వేలంలో ప్రసిధ్ ను రూ. 10 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. 2022 సీజన్ లో ప్రసిధ్ మంచి ప్రదర్శన చేశాడు. 19 వికెట్లు తీశాడు. రాజస్తాన్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. (PC : TWITTER)
6/ 7
అయితే ఈ సీజన్ కు ప్రసిధ్ దూరం కావడం రాజస్తాన్ రాయల్స్ కు పెద్ద ఎదురుదెబ్బ. అయితే అతడి స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ కోసం అన్వేషిస్తున్నట్లు రాజస్తాన్ రాయల్స్ పేర్కొంది. (PC : TWITTER)
7/ 7
ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. కీలక బౌలర్ కైలీ జెమీసన్ ఈ సీజన్ కు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా దీపక్ చహర్ గాయంపై కూడా సమాచారం లేదు. (PC : TWITTER)