ఓపెనింగ్ ను బలోపేతం చేసేందుకు మయాంక్ అగర్వాల్ ను సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ఓపెనర్ గా మయాంక్ అగర్వాల్ ధాటిగా బ్యాటింగ్ చేయగలడు. గత సీజన్ లో విఫలమైనప్పటికీ మయాంక్ టెక్నిక్ ను కొట్టి పారేయలేం. అభిషేక్ శర్మతో కలిసి మయాంక్ మంచి భాగస్వామ్యాలను నెలకొల్పుతాడని భారీ అంచనాలను సన్ రైజర్స్ పెట్టుకుంది.