SRH : ఐపీఎల్ కొత్త సీజన్ లో ఈ నలుగురు SRH స్టార్స్ బెంచ్ కే పరిమితం అయ్యే ఛాన్స్.. ఇందులో సెంచరీ హీరో కూడా
SRH : ఐపీఎల్ కొత్త సీజన్ లో ఈ నలుగురు SRH స్టార్స్ బెంచ్ కే పరిమితం అయ్యే ఛాన్స్.. ఇందులో సెంచరీ హీరో కూడా
IPL 2023 : గత సీజన్ లాగే ఈసారి కూడా ఐపీఎల్ జరగనుంది. మొత్తం 10 జట్లు తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగినంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ మరో రెండు నెలల్లో ఆరంభం కానుంది. మార్చి చివరి వారంలో లేదా.. ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ కొత్త సీజన్ ఘనంగా ఆరంభమయ్యే అవకాశం ఉంది.
2/ 7
గత సీజన్ లాగే ఈసారి కూడా ఐపీఎల్ జరగనుంది. మొత్తం 10 జట్లు తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగినంది.
3/ 7
2020 వరకు కూడా అత్యంత నిలకడైన జట్టుగా కొనసాగుతూ వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. 2021 నుంచి గాడి తప్పింది. గత రెండు సీజన్లలోనూ పేలవ ప్రదర్శన చేసి అభిమానుల చేత చివాట్లు కూడా తింది.
4/ 7
అయితే ఈసారి మాత్రం మంచి ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో సన్ రైజర్స్ టీం కనిపిస్తుంది. అందుకు తగ్గట్లే గతేడాది డిసెంబర్ లో జరిగిన మినీ వేలంలో మంచి స్ట్రాటజీతో ప్లేయర్లను కొనుగోలు చేసింది.
5/ 7
సన్ రైజర్స్ జట్టు ఈసారి మరింత పటిష్టంగా కనిపిస్తుంది. హ్యారీ బ్రూక్, క్లాసెన్, మయాంక్ అగర్వాల్, ఆదిల్ రషీద్ లు రావడంతో జట్టు ఓపెనింగ్, మిడిలార్డర్, ఫినిషింగ్, స్పిన్ విభాగాలు బలంగా మారాయి.
6/ 7
సన్ రైజర్స్ చాలా మంది మంచి ప్లేయర్లు ఉన్నా.. అందులో కొంత మందికి నిరాశ తప్పేలా లేదు. ముఖ్యంగా నలుగురు విదేశీ ప్లేయర్లనే ఆడించాలన్న నిబంధన కారణంగా ఫారెన్ ప్లేయర్స్ లో చాలా మంది బెంచ్ కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది.
7/ 7
వీరిలో న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్, అఫ్గాన్ పేసర్ ఫరూఖీ, విండీస్ స్పిన్నర్ అకీల్ హుస్సేన్ లు ఉన్నారు. వీరిలో గ్లెన్ ఫిలిప్స్ టి20 ప్రపంచకప్ లో శతకం బాదిన సంగతి తెలిసిందే. ఇక గత కొన్నేళ్లుగా జట్టుతో ఉంటూ వస్తోన్న అబ్దుల్ సమద్ కూడా బెంచ్ కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది.