IPL 2023 : అప్పుడు పంత్ కు జట్టులో చోటు లేకుండా చేశాడు.. ఇప్పుడు ధోనితో పోటీ.. 37 ఏళ్ల వయసులో కూడా తగ్గేదే లే!
IPL 2023 : అప్పుడు పంత్ కు జట్టులో చోటు లేకుండా చేశాడు.. ఇప్పుడు ధోనితో పోటీ.. 37 ఏళ్ల వయసులో కూడా తగ్గేదే లే!
IPL 2023 : క్రికెట్ పండుగ ఐపీఎల్ 2023కి సమయం ఆసన్నమైంది. ధనాధన్ లీగ్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ 2023 ఎంతో దూరంలో లేదు. టీ20 లీగ్ కొత్త సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఇప్పటివరకు ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లితో పాటు దినేష్ కార్తీక్ కూడా ఈసారి బాగా రాణించి ఈ కరువుకు స్వస్తి చెప్పాలనుకుంటున్నాడు.
2/ 7
ఐపీఎల్ గత సీజన్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. ఈ ప్రదర్శనతో ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ ప్లే-ఎలెవన్‌కు దూరమయ్యాడు. ప్రస్తుత సీజన్లో ఎంఎస్ ధోని రికార్డుపై కన్నేశాడు దినేష్ కార్తీక్. (AFP)
3/ 7
ఐపీఎల్ రికార్డులను పరిశీలిస్తే.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ 234 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 170 మందిని తన కీపింగ్ ద్వారా ఔట్ చేశాడు. 41 ఏళ్ల ధోని 131 క్యాచ్‌లు, 39 స్టంపింగ్‌లు చేశాడు. అదే సమయంలో, 37 ఏళ్ల దినేష్ కార్తీక్ 159 ఔట్లతో రెండో స్థానంలో నిలిచాడు. (AFP)
4/ 7
ఐపీఎల్లో దినేష్ కార్తీక్ ఇప్పటి వరకు 229 మ్యాచ్‌లు ఆడాడు. 125 క్యాచ్‌లు, 34 స్టంపింగ్‌లు చేశాడు. టీ20 లీగ్‌లో ఇప్పటివరకు 27 సగటుతో 4376 పరుగులు చేశాడు. 20 అర్ధ సెంచరీలు సాధించాడు. అజేయంగా 97 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన. స్ట్రైక్ రేట్ 133. (dipika pallikal Instagram)
5/ 7
మొదటి భార్య చేతిలో మోసపోయిన తర్వాత దినేష్ కార్తీక్ మైదానంలో మరింత మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆ తర్వాత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ని పెళ్లాడాడు. 373 టీ20 మ్యాచ్‌ల్లో 28 సగటుతో 6941 పరుగులు చేశాడు. 32 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. (Dinesh Karthik, Nikita Vijay/Instagram)
6/ 7
దినేష్ కార్తీక్ టీమ్ ఇండియా తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో 9 హాఫ్ సెంచరీలు, టీ20 ఇంటర్నేషనల్‌లో ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. (dk00019/Instagram)
7/ 7
IPL 2022లో RCB జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. దినేష్ కార్తీక్ అద్భుత ప్రదర్శన చేసి 16 మ్యాచ్‌ల్లో 55 సగటుతో 330 పరుగులు చేశాడు. అతను 10 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. గత సీజన్ లో కార్తీక్ కాక స్ట్రైక్ రేట్ 183. (Dinesh karthik Instagram)