ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు (223) ఆడిన ఆటగాడు విరాట్ కోహ్లీ. 2016లో ఐపీఎల్లో ఒకే సీజన్లో 973 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఒక సీజన్లో మరే ఇతర బ్యాట్స్‌మెన్ 900 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. మూడు డబుల్ సెంచరీల భాగస్వామాల్లో (ఏబీ డివిలియర్స్‌తో 2 మరియు క్రిస్ గేల్‌తో 1) పాల్గొన్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఎవ్వరివల్లా కాని రికార్డుల్ని చేయడంలో కోహ్లీ ముందుంటాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ఇప్పటి వరకు 223 మ్యాచ్‌లు ఆడి 6,624 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత శిఖర్ ధావన్ ఉన్నాడు. గబ్బర్ 6,244 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఐపీఎల్లో 6000కు పైగా పరుగులు చేయగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్లోనూ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచే అవకాశం. విరాట్ కోహ్లీ 36.2 సగటుతో మరియు 129.14 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఐపీఎల్లో విరాట్‌కు 44 అర్ధ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. (PTI)
7000 పరుగుల మైల్ స్టోన్: విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 7,000 పరుగుల మార్క్‌ను దాటడానికి 376 పరుగులు చేయాలి. ఐపీఎల్ 2023లో కోహ్లీ 376 పరుగులు చేస్తే.. ఈ టోర్నీలో 7,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. IPL చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ (RCB) కోసం గత 15 సీజన్లు ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ.
ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల పరంగా తన మాజీ సహచరుడు క్రిస్ గేల్‌ను అధిగమించేందుకు విరాట్ కోహ్లీకి రెండు సెంచరీలు అవసరం. ఐపీఎల్లో క్రిస్ గేల్ ఆరు సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ 5-5 సెంచరీలతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.విరాట్ సెంచరీ సాధిస్తే గేల్‌తో సమానంగా నిలుస్తారు. ఒక వేళ రెండు సెంచరీలు చేస్తే 'యూనివర్స్ బాస్' కంటే ముందుంటాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2016లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడు నాలుగు సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. ఒక సీజన్లో నాలుగు సెంచరీలు చేసిన విరాట్ తర్వాత బట్లర్ మాత్రమే ఉన్నాడు. ఐపీఎల్ గత సీజన్లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. (Virat Kohli/Instagram)
100 క్యాచ్‌ల మైల్ స్టోన్: విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కింగ్‌గానే కాకుండా చాలా మంచి ఫీల్డర్ కూడా. ఐపీఎల్లో ఫీల్డర్‌గా 100 క్యాచ్‌లు పూర్తి చేయడానికి అతనికి మరో ఏడు క్యాచ్‌లు అవసరం. ప్రస్తుతం సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103) ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు. ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో కోహ్లీ కంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ (94 క్యాచ్‌లు) మాత్రమే. శిఖర్ ధావన్ (92 క్యాచ్‌లు) ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్లో 50+ స్కోరు: ఐపీఎల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లి కేవలం అర్ధ సెంచరీ దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 49 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు చేశాడు. 59 సార్లు ఈ ఫీట్ అందుకుని డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీతో సమానంగా శిఖర్ ధావన్ ఉన్నాడు. ఈ సీజన్లో శిఖర్ను అధిగమించాలని విరాట్ భావిస్తున్నాడు.
ఆరోన్ ఫించ్ రికార్డు బ్రేక్: విరాట్ కోహ్లి ప్రస్తుతం 360 మ్యాచ్‌లలో 40.88 సగటుతో 11,326 పరుగులతో T20 చరిత్రలో ఐదవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (11,392) పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. మరో 67 పరుగులు చేస్తే ఫించ్ ను దాటగలడు కోహ్లీ. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14,562), కీరన్ పొలార్డ్ (12,528), షోయబ్ మాలిక్ (12,175) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. టీ20 క్రికెట్లో కోహ్లి 85 హాఫ్ సెంచరీలు, ఆరు సెంచరీలు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 133.01. (Twitter/ipl)