Delhi Capitals : థ్రిల్లర్ మ్యాచ్ లో విండీస్ సూపర్ విక్టరీ.. శివతాండవం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్
Delhi Capitals : థ్రిల్లర్ మ్యాచ్ లో విండీస్ సూపర్ విక్టరీ.. శివతాండవం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్
Delhi Capitals : అయితే ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ దే పైచేయిగా నిలిచింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 11 ఓవర్ల చొప్పున కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 11 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసింది.
ఒకవైపు ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ కు ఏర్పాట్లు వేగంగా పూర్తవుతుంటే.. మరో వైపు వెస్టిండీస్ (West Indies), సౌతాఫ్రికా (South Africa) జట్ల మధ్య జరగుతున్న టి20 సిరీస్ ఫుల్ మజాను ఇస్తోంది. శనివారం ఈ రెండు జట్ల మధ్య తొలి టి20 పోరు జరిగింది.
2/ 7
అయితే ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ దే పైచేయిగా నిలిచింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 11 ఓవర్ల చొప్పున కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 11 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసింది.
3/ 7
డేవిడ్ మిల్లర్ 22 బంతుల్లో 48 పరుగులతో కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సక్సర్లు ఉండటం విశేషం. అయితే మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ మాత్రం నిలవలేదు.
4/ 7
ఛేదనలో విండీస్ ను ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ రోవ్ మన్ పావెల్ శివతాండవం చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఏకంగా 5 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఒక ఫోర్ బాదాడు.
5/ 7
ఒక ఎండ్ లో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ లో మాత్రం పావెల్ రెచ్చిపోయి ఆడాడు. దాంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విండీస్ 10.3 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసి నెగ్గింది.
6/ 7
ఫలితంగా మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టి20 ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ఆరంభం కానుంది.
7/ 7
ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు మార్క్రమ్ (14), క్లాసెన్ (1) విఫలం అయ్యారు. గాయం కారణంగా ఐపీఎల్ 16వ సీజన్ నుంచి రిషభ్ పంత్ తప్పుకున్నాడు. అయితే రోవ్ మన్ పావెల్ ఫామ్ లోకి రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభ పరిణామం.