గతేడాది మాత్రమే రోహిత్ శర్మ (Rohit Sharma)కు టీమిండియా (Team India) కెప్టెన్సీ దక్కింది. అతని కెప్టెన్సీలో భారత్ టీ20, వన్డేల్లో మంచి ప్రదర్శన చేసింది. కానీ, మల్టీ నేషన్ టోర్నీల్లో జట్టు గెలవలేకపోయింది. ఆసియా కప్ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యాన్ని చవిచూడాల్సి వచ్చింది. రోహిత్ సొంత ఫామ్ మరియు ఫిట్నెస్ కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. అయితే ఈ విషయాలన్నీ అతని సంపాదనపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఐపీఎల్ నుంచి అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని వెనక్కి నెట్టాడు. (IPL Instagram)
2008 IPL కోసం వేలం జరిగినప్పుడు.. మహేంద్ర సింగ్ ధోని వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ.6 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత ధోని ఆదాయం పెరిగింది. ఎక్కువ మొత్తంలో ధోనికి చెల్లించింది సీఎస్కే. అయితే.. గత ఐపీఎల్ సీజన్లో ధోనీ తన వేతనాన్ని తగ్గించుకున్నాడు. అతను CSK నుండి 12 కోట్ల రూపాయలు పొందాడు. ఇప్పటి వరకు 15 సీజన్లలో రూ.176.8 కోట్లు రాబట్టాడు. (IPL Instagram)
ఇక రోహిత్ శర్మను IPL 2008 వేలంలో డెక్కన్ ఛార్జర్స్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాతి 2 సీజన్లలో కూడా డెక్కన్ ఛార్జర్స్ రోహిత్‌కు కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే జీతం ఇచ్చింది. 2011లో రోహిత్ రూ.9.2 కోట్లకు ముంబై ఇండియన్స్‌తో చేరాడు. 2014లో ముంబై అతనికి 12.5 కోట్లు, 2018లో 15 కోట్లు ఇచ్చింది. ఐపీఎల్ 2022 కోసం.. రోహిత్‌ను ముంబై ఇండియన్స్ రూ. 16 కోట్లకు అట్టిపెట్టుకుంది. ( Mumbai Indians Instagram)
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్. ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. డెక్కన్ ఛార్జర్స్‌తో కలిసి 2009లో తొలిసారి ఐపీఎల్‌ను గెలుచుకున్నాడు. అంటే మొత్తంగా ఐపీఎల్లో 6 టైటిల్స్ సాధించాడు. చివరిసారిగా 2020లో రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2021, 2022లో జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. (IPL Instagram)
2011లో ఆర్సీబీ రూ.8.2 కోట్ల వేతనాన్ని చెల్లించింది. 2014లో రూ.12.5 కోట్లు, 2018లో రూ.17 కోట్లు వేతనంగా పొందాడు కోహ్లీ. 2021 వరకు, అతను RCB నుండి కేవలం 17 కోట్లు మాత్రమే పొందాడు. అయితే 2022లో ఆటగాళ్లను నిలబెట్టుకునేందుకు కోహ్లీ వేతనం రూ.15 కోట్లకు తగ్గింది. IPL 2023 కోసం కూడా RCB కేవలం రూ.15 కోట్లు మాత్రమే చెల్లించనుంది. (IPL Instagram)
ఇక, సురేశ్ రైనా ఐపీఎల్లో సంపాదన పరంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. 14 ఏళ్లలో లీగ్ ద్వారా రూ.110.7 కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత సునీల్ నరైన్ ఎక్కువ మొత్తం సంపాదించిన ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్‌కు చెందిన ఈ డాషింగ్ ఆల్‌రౌండర్ 12 ఏళ్లలో ఐపీఎల్ నుండి మొత్తం రూ.107.2 కోట్లు సంపాదించాడు. (IPL Instagram)