డకౌట్స్ జాబితాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్లో 227 మ్యాచ్‌లు ఆడి 222 ఇన్నింగ్స్‌ల్లో 5,879 పరుగులు చేశాడు. ఇందులో 14 సార్లు డకౌట్ అయ్యాడు. డకౌట్ విషయంలో రోహిత్, మన్ దీప్ సింగ్ లు సమానంగా ఉన్నా.. మన్ దీప్ తక్కువ మ్యాచ్ ల్లో ఎక్కువ సార్లు డకౌట్ అయ్యాడు. దాంతో అతడు ప్రస్తుతానికి నెంబర్ వన్ గా ఉన్నాడు.