ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్నా ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా చాంపియన్ గా నిలవలేదు. ప్రతి ఏడాది హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగడం.. నిరాశ పరచడం ఆర్సీబీకి ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఆర్సీబీ టైటిల్ ఫేవరెట్స్ లో ఒకటిగా బరిలోకి దిగనుంది. ఈసారి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తన ముందున్న 6 సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది.
1. గతేడాది రజత్ పటిదార్ ఆర్సీబీ తరఫున మంచి ప్రదర్శన చేశాడు. దేశవాళి క్రికెట్ లో రజత్ పటిదార్ అద్బుత ప్రదర్శన చేశాడు. టీమిండియాకు కూడా సెలెక్ట్ అయ్యాడు. అయితే టోర్నీకి ముందు రజత్ పటిదార్ గాయం బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడు కాలి మడమ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దాంతో అతడు దాదాపు సగం లీగ్ కు దూరమైన పరిస్థితి. రజత్ పటిదార్ జట్టుకు దూరమైతే ఆర్సీబీ మిడిలార్డర్ వీక్ గా మారే అవకాశం ఉంది.
2. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ అనంతరం గ్లెన్ మ్యాక్స్ వెల్ కాలికి తీవ్ర ప్రమాదం జరిగింది. సర్జరీ కూడా చేయించుకున్నాడు. దాదాపు 6 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలె భారత్ తో జరిగిన వన్డే సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే తొలి వన్డే అనంతరం బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఆర్సీబీతో కలిసినా.. తాను 100 శాతం ఫిట్ గా లేనని ప్రకటించాడు. రజత్ పటిదార్ తో పాటు గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా జట్టుకు దూరమైతే ఆర్సీబీ మిడిలార్డర్ పేలవంగా మారడం ఖాయం.
4. గత కొన్ని సీజన్ల పాటు ఆర్సీబీకి డెత్ ఓవర్స్ స్పెషలిస్టుగా హర్షల్ పటేల్ ఉన్నాడు. గత ఐపీఎల్ లోనూ మంచి ప్రదర్శన చేశాడు. అనంతరం టీమిండియా తరఫున రాణించాడు. అయితే గాయం తర్వాత తేలిపోతున్నాడు. టి20 ప్రపంచకప్ లో దారుణంగా విఫలం అయ్యాడు. ప్రస్తుతం టీమిండియాకు దూరమయ్యాడు. ఈ క్రమంలో హర్షల్ పటేల్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.