IPL 2023 ఈసారి భిన్నంగా ఉండనుంది. స్వదేశంలో ఈ మెగా లీగ్ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కండీషన్స్ లో మంచి స్పిన్ బౌలర్లు ఉన్న జట్లు రెచ్చిపోవడం ఖాయం. గత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లలో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. ఈసారి కూడా హోమ్-అవే ఫార్మాట్‌ను పరిశీలిస్తే స్పిన్ బౌలర్లు తమ హవా చూపించడం ఖాయం. ఐపీఎల్ 16వ సీజన్లో అందరి చూపు 5 స్పిన్నర్లపైనే ఉంటుంది. వారెవరో ఓ లుక్కేద్దాం. (IPL Instagram)
యుజ్వేంద్ర చాహల్: IPL 2022 పర్పుల్ క్యాప్‌ను రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గెలుచుకున్నాడు. అతను 17 మ్యాచ్‌ల్లో 19.5 సగటుతో 27 వికెట్లు తీశాడు. ఒకసారి 4 వికెట్లు, మరోసారి 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. అయితే ఆ ఐపీఎల్ తర్వాత చాహల్ ఆటతీరులో నిలకడ లోపించింది. టీ20 ప్రపంచకప్‌లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. గత ఏడాది కాలంలో చాహల్ 21 టీ20ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. గత ఐదు టీ20ల్లో ఈ లెగ్ స్పిన్నర్ 2 వికెట్లు మాత్రమే తీశాడు. అయితే ఐపీఎల్లో చాహల్‌ను తక్కువ అంచనా వేస్తే పొరపాటే. ఈ ధనాధన్ లీగ్ లో చాహల్ కు మంచి రికార్డు ఉంది. (Yuzvendra chahal Instagram)
రషీద్ ఖాన్: గుజరాత్ టైటాన్స్ యొక్క ఈ లెగ్ స్పిన్నర్ ఇటీవల T20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 అయ్యాడు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టడంలో రషీద్ కీలకపాత్ర పోషించాడు. IPL 2022లో.. రషీద్ 16 మ్యాచ్‌లలో 6.59 ఎకానమీ రేటుతో 19 వికెట్లు తీశాడు. ఇక..ఈ నెలలో లాహోర్ ఖలందర్స్‌తో పాకిస్తాన్ సూపర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆ టోర్నీలో ఈ లెగ్ స్పిన్నర్ 11 ఇన్నింగ్స్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి జట్టకు ముప్పుగా మారనున్నాడు. (PSL Instagram)
కుల్దీప్ యాదవ్: IPL 2022 చైనామన్ స్పిన్నర్‌కు టీమిండియాలోకి రీ ఎంట్రీగా మారింది. గత సీజన్లో కుల్దీప్ 14 మ్యాచ్‌ల్లో 20 సగటుతో 21 వికెట్లు తీశాడు. కుల్దీప్ ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసిన తర్వాత మాత్రమే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా గత ఆరు నెలలు కుల్దీప్ అద్భుతంగా రాణించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 20 మ్యాచ్‌లు ఆడి మొత్తం 38 వికెట్లు తీశాడు. కుల్దీప్ ఇప్పుడు ప్రపంచకప్ బెర్త్ పై కన్నేశాడు. దీంతో.. ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాడు. తద్వారా ప్రపంచకప్ జట్టు టిక్కెట్‌ను తగ్గించుకోవచ్చు. (BCCI)
వానిందు హసరంగ: ఈ శ్రీలంక స్పిన్నర్ గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గేమ్‌చేంజర్‌గా నిరూపించుకున్నాడు. హసరంగ IPL 2022లో పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. కానీ, చివరికి చాహల్ కి పర్పుల్ క్యాప్ దక్కింది. హసరంగ 16 మ్యాచ్‌ల్లో 16.53 సగటుతో 26 వికెట్లు తీశాడు. హసరంగ టీ20ల్లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్. గతేడాది 19 టీ20ల్లో 34 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ తోనూ విధ్వంసం సృష్టించగలడు. (RCB Instagram)
సునీల్ నరైన్: కోల్‌కతా నైట్ రైడర్స్‌కి చెందిన ఈ మిస్టరీ స్పిన్నర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్‌కు ముందు ఎలాంటి పరుగులు ఇవ్వకుండా క్లబ్ మ్యాచ్‌లో 7 ఓవర్లలో 7 వికెట్లు తీశాడు. గత సీజన్లో నరేన్ ఫేడవుట్ అయ్యాడని అందరూ అనుకున్నారు. కానీ, సునీల్ నరైన్ ఎప్పటికైనా డేంజర్. అతని బౌలింగ్ లో వరల్డ్ క్లాస్ బ్యాటర్లు కూడా పరుగులు చేయడానికి నానా తంటాలు పడతారు.