ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టు 4 సార్లు ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణి కొట్టింది. 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. (Narayan Jagadeesan twitter)
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారి కొత్త కెప్టెన్ నితీష్ రాణాతో బరిలోకి దిగుతోంది. గత సీజన్లో సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో కేకేఆర్ తొలి మ్యాచ్ ఆడుతుంది. అయితే.. ఫస్ట్ మ్యాచులో ఫస్ట్ క్రికెట్ లో పరుగుల వరద పారించిన నారాయణ్ జగదీషన్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. (Narayan Jagadeesan twitter)
విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 9 రోజుల్లో 5 మ్యాచ్‌లు ఆడుతూ ఎన్ జగదీషన్ ఐదు సెంచరీలు చేశాడు. ఈ బ్యాట్స్‌మెన్ వరుసగా 5 మ్యాచ్‌ల్లో సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర మరియు దక్షిణాఫ్రికాకు చెందిన అల్బిరో పీటర్సన్ ఈ జాబితాలో వరుసగా 4 సెంచరీలు సాధించారు. ఆ రికార్డును ఈ చెన్నై కుర్రాడు బద్దలు కొట్టాడు. ఇక.. తుది జట్టులో చోటు దక్కకపోయినా.. ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు జగదీషన్ (Narayan Jagadeesan twitter)
ఇక, విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టి, 200 స్ట్రైక్ రేట్‌తో 277 పరుగులు చేసిన అతని ఇన్నింగ్స్ లిస్ట్ A క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. (Narayan Jagadeesan twitter)