ఈ టాస్ రూల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అమలు చేస్తున్న స్లో ఓవరేట్ పెనాల్టీ రూల్‌ను కూడా అమలు చేయనున్నారు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయకుంటే.. సర్కిల్ బయటన నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని ఓవర్లు తక్కువైతే.. అన్ని ఓవర్ల పాటు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే ఈ రూల్ అమలవుతుండగా.. ఐపీఎల్లో మొదటిసారి ప్రవేశపెట్టనున్నారు.
బౌలర్ రన్నప్ లో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా వికెట్ కీపర్ లేదా ఫీల్డర్ తన స్థానం నుంచి కదిలితే దానిని అనైతిక చర్యగా అంపైర్లు భావిస్తారు. అంతేకాకుండా ఐదు పరుగులను పెనాల్టీ రూపంలో బ్యాటింగ్ జట్టుకు అందజేస్తారు. ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించనున్నారు. ఉద్దేశపూర్వకంగా బ్యాటర్ దృష్టి మరల్చినా.. ఇబ్బందిపెట్టినా అనైతిక చర్యగా భావిస్తారన్న విషయం తెలిసిందే.