ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni).. ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 41 ఏళ్ల ధోనీ 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత గత మూడేళ్ల నుంచి కేవలం ఐపీఎల్లో మాత్రమే ధోనీ ఆడుతున్నాడు.
ఐపీఎల్ 2022 ముంగిట చెన్నై కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసిన ధోనీ.. ఐపీఎల్‌కి కూడా టాటా చెప్పేసేలా కనిపించాడు. కానీ.. కెప్టెన్‌గా జడేజా ఫెయిలవడంతో మళ్లీ సీజన్ మధ్యలోనే పగ్గాలు అందుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ 2023 (IPL 2023)లోనూ చెన్నై జట్టుని ధోనీనే కెప్టెన్‌గా నడిపించబోతున్నాడు.కానీ.. ధోనీకి ఐపీఎల్ 2023 సీజన్ ఆఖరిది అని మాజీ క్రికెటర్లు జోస్యం చెప్తున్నారు.
అయితే, ధోని రిటైర్ వార్తలపై ముంబై ఇండియన్స్ స్కిప్పర్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ధోనీ ఇప్పుడప్పుడే రిటైర్ కాబోడని, మరో రెండుమూడేళ్లు ఐపీఎల్ ఆడగలడని అన్నాడు. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రీ సెషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
చెన్నై జట్టులో ధోనీ ఇప్పటికీ కీలక ఆటగాడిగానే ఉన్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి చెన్నైకి ఆడుతున్న ధోనీ 234 మ్యాచుల్లో 4,978 పరుగులు చేశాడు. నాలుగు టైటిళ్లు అందించాడు. ఐపీఎల్ 2023 తనకు చివరి సీజన్ అని ధోనీ గతంలో హింట్ ఇచ్చాడు. 2023లో దేశమంతా పర్యటించి అభిమానులకు గుడ్ బై చెప్పాలని ఉందని అప్పట్లో పేర్కొన్నాడు. అయితే.. రోహిత్ వ్యాఖ్యలతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటికే 15 సీజన్లు ముగిశాయి. ఈ క్రమంలో నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని విజేతగా నిలిపిన కెప్టెన్ ధోనీ.. టోర్నీలోనే విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. కానీ.. బ్యాటర్‌గా మాత్రం గత రెండు సీజన్లలో ధోనీ అంచనాల్ని అందుకోలేకపోయాడు. మార్చి తొలి వారం నుంచే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే.