మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తమ ఆరో టైటిల్ కోసం పోరాడనుంది. ఈ టోర్నీలో.. అందరి దృష్టి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై ఉంది. అతను ఈ ఐపిఎల్ సీజన్లో అనేక రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్ మరియు కెప్టెన్లలో రోహిత్ ఒకడు. IPL 2023లో హిట్ మ్యాన్ బద్దలు కొట్టగల రికార్డులను ఇక్కడ చూద్దాం.(Bcci/Ipl)
6000 పరుగుల మైల్ స్టోన్: రోహిత్ శర్మ ఐపీఎల్లో 6,000 పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి కేవలం 121 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ మాత్రమే ఈ రికార్డు సృష్టించిన ఇద్దరు క్రికెటర్లు. వచ్చే సీజన్లో రోహిత్ శర్మతో పాటు డేవిడ్ వార్నర్ కూడా ఈ మైల్ స్టోన్ పై కన్నేశరు. ఇప్పుడు ఉన్న ఏ యాక్టివ్ ఆటగాడు కూడా IPLలో 5,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులను చేరుకోలేకపోయాడు. (Rohit Sharma/Instagram)
విరాట్ కోహ్లీ తర్వాత అరుదైన రికార్డు: 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరిన దగ్గర నుంచి.. రోహిత్ శర్మ ఫ్రాంచైజీ కోసం 182 మ్యాచ్‌లలో 30.18 సగటుతో 4,709 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున 5000 పరుగుల ఫిగర్‌ను చేరుకోవడానికి రోహిత్‌కు 291 పరుగులు అవసరం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు కోహ్లీ (6,624) ఫ్రాంచైజీకి 5,000 లేదా అంతకంటే ఎక్కువ IPL పరుగులు చేసిన ఏకైక ఆటగాడు. డెక్కన్ ఛార్జర్స్ తరపున రోహిత్ శర్మ ఐపీఎల్ మూడు సీజన్లు ఆడిన సంగతి తెలిసిందే. (Rohit Sharma/Instagram)
కెప్టెన్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు: కెప్టెన్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ మరో ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన మహేంద్ర సింగ్ ధోని (210) ప్రస్తుతం ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్. రోహిత్ ఇప్పటివరకు 143 మ్యాచ్‌లలో (సూపర్ ఓవర్ విజయాలు మినహా) ముంబై ఇండియన్స్‌కు 79 విజయాలు అందించాడు. 56.64 విజయ శాతంతో దుమ్మురేపాడు. (Rohit Sharma/Instagram)
T20 క్రికెట్లో 11,000 పరుగులు: ఓవరాల్ గా టీ20 క్రికెట్ లో రోహిత్ శర్మ 407 మ్యాచ్‌లలో 31.0 సగటు.. 133.55 స్ట్రైక్ రేట్‌తో 10,703 పరుగులు చేశాడు. కోహ్లి (11,326) తర్వాత 11,000 టీ20 పరుగులు మైల్ స్టోన్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు రోహిత్. మరో 297 పరుగులు చేస్తే 11 వేల పరుగుల మైల్ స్టోన్ అందుకుంటాడు. టీ20 పరుగుల పరంగా రోహిత్ శర్మ కంటే ముందు క్రిస్ గేల్ (14,562), కీరన్ పొలార్డ్ (12,528), షోయబ్ మాలిక్ (12,175), ఆరోన్ ఫించ్ (11,392), డేవిడ్ వార్నర్ (11,179), అలెక్స్ హేల్స్ (10,916) ముందున్నారు. ( Image: AFP)
100 క్యాచులు: గొప్ప బ్యాట్స్‌మన్, కెప్టెన్‌గానే కాకుండా.. రోహిత్ శర్మ అద్భుతమైన ఫీల్డర్ కూడా.ప్రస్తుతం ఐపీఎల్ లో 97 క్యాచులు పట్టాడు. 100 క్యాచ్‌ల ఫిగర్‌ను అందుకోవడానికి రోహిత్ కు మరో మూడు క్యాచ్‌లు కావాలి. ప్రస్తుతం ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో సురేశ్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103) మాత్రమే ఉన్నారు. కోహ్లీ (93), ధావన్ (92) కూడా ఈ ఘనత సాధించగలరు.