IPL 2023 : ఐపీఎల్ 2023 కోసం రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్.. ప్లేయింగ్ ఎలెవెన్ తో భయపెడుతోన్న హిట్ మ్యాన్
IPL 2023 : ఐపీఎల్ 2023 కోసం రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్.. ప్లేయింగ్ ఎలెవెన్ తో భయపెడుతోన్న హిట్ మ్యాన్
IPL 2023 : అయితే గత సీజన్ లో ముంబై ఆట గతి తప్పింది. పేలవ ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది మాత్రం పూర్వపు ఫామ్ ను అందుకొని మరోసారి ఐపీఎల్ చాంపియన్ గా నిలవాలని పట్టుదలగా ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) చరిత్రలోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్టుగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఉంది. ఏకంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ ను నెగ్గి.. అత్యధిక సార్లు ఈ ఘనత వహించిన జట్టుగా ఉంది.
2/ 8
అయితే గత సీజన్ లో ముంబై ఆట గతి తప్పింది. పేలవ ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది మాత్రం పూర్వపు ఫామ్ ను అందుకొని మరోసారి ఐపీఎల్ చాంపియన్ గా నిలవాలని పట్టుదలగా ఉంది.
3/ 8
ఇక ఈ సీజన్ కోసం రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశాడు. ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవెన్ పై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. జస్ ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కావడంతో ముంబై బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
4/ 8
అయినప్పటికీ ఉన్న వనరులతో పటిష్ట ప్లేయింగ్ ఎలెవెన్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జట్టులో 6 స్థానాల్లో ప్లేయర్లు ఫిక్స్ అయ్యారు. ఇక మిగిలిన ఐదు స్థానాలు కూడా సిద్ధం కాగా.. వీటికి బ్యాకప్ ప్లేయర్లను సిద్ధం చేసినట్లు సమాచారం.
5/ 8
ఓపెనర్లుగా ఇషాన్ కిషన్.. రోహిత్ శర్మలు ఉండనున్నారు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, గ్రీన్ లు ఉంటారు. ఇక ఫినిషర్ లుగా టిమ్ డేవిడ్, అర్షద్ ఖాన్ లు ఉంటారు.
6/ 8
ఇక స్పిన్నర్లుగా కుమార్ కార్తీకేయ, పీయూశ్ చావ్లాలు ఉండనున్నారు. పేసర్లుగా బెహ్రండార్ఫ్, జోఫ్రా ఆర్చర్ లు ఉంటారు. వీరికి బ్యాకప్ ప్లేయర్లుగా డివాల్డ్ బ్రేవీస్, సోకీన్, డుయన్ యాన్సెన్, రాఘవ్ లు ఉండనున్నారు.
7/ 8
ఈసారి ఐపీఎల్ లో ఆరంభం నుంచే రెచ్చిపోవాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, గ్రీన్, తిలక్ వర్మలు ఫామ్ లో ఉన్నారు. ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్ తో నిరాశ పరిచాడు.
8/ 8
అయితే టి20 ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే ప్లేయర్. ఇక ఇషాన్ కిషన్ కూడా లయ అందుకంటే ఈసారి ఐపీఎల్ లో ముంబైని ఆపడం ఎవరి తరం కాదు.