ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) సీజన్ మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పాత ఫార్మాట్ లోకి వచ్చింది. IPL 2023 హోమ్ మరియు ఎవే ఫార్మాట్లో ఆడబడుతుంది. అంటే, అన్ని జట్లు తమ సొంత మైదానంలో మరియు ఇతర జట్ల హోమ్ గ్రౌండ్లో ఒకదానితో ఒకటి తలపడతాయి. ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్ (Gujarat Titans), నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు..టోర్నమెంట్ యొక్క ఆల్ టైమ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం.
అత్యధిక పరుగులు: 6624 పరుగులతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐపిఎల్ చరిత్రలో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 223 మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ 129.14 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. కోహ్లీ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐదు సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు చేశాడు. (PIC: PTI)
అత్యధిక వికెట్లు: ఐపీఎల్లో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 183 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. డ్వేన్ బ్రావో ఇప్పటి వరకు ఐపీఎల్లో 161 మ్యాచ్‌లు ఆడాడు. బ్రావో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ జట్లలో భాగంగా ఉన్నాడు. అయితే, డ్వేన్ బ్రావో ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (AFP)
అత్యధిక ఫోర్లు: ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో శిఖర్ ధావన్ 701 ఫోర్లు కొట్టాడు. ఈ జాబితాలో 578 ఫోర్లతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 561 ఫోర్లు బాదాడు డేవిడ్ బాయ్. (AFP)