ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్.. ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ముందున్నాడు. ఈ లీగ్ లో అతను కేవలం 162 ఇన్నింగ్స్‌లలో 55 అర్ధ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం వార్నర్ అర్థ సెంచరీల రికార్డును అధిగమించడం సులభంగా ఏమీ లేదు. మొన్నటి వరకు బ్యాడ్ బాయ్ ఇమేజ్ తో ఉన్న వార్నర్ అంటే భారత అభిమానులకు ఎనలేని ప్రేమ. తెలుగు పాటలతో పాటు హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తూ వార్నర్ భారత అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు.