కొచ్చి వేదికగా డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఒక అవకాశం ఇచ్చింది. మెగా వేలంలో భారీ మొత్తంలో కొని.. తీరా వారు విఫలమై.. ఇప్పుడు తమకు సదరు ప్లేయర్స్ అవసరం లేదనుకుంటే నిరభ్యంతరంగా వదిలేసే అవకాశాన్ని ఇచ్చింది. రిలీజ్ చేసే ప్లేయర్ల వివరాలను బీసీసీఐకి తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి ఆఖరి తేది నవంబర్ 15.
ఈ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందున్నాడు. 2022 సీజన్ ను కు ముందు కేన్ మామను రూ. 14 కోట్లకు సన్ రైజర్స్ రీటెయిన్ చేసుకుంది. అయితే అతడు సీజన్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 13 మ్యాచ్ ల్లో 216 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రయిక్ రేట్ 93. ప్రస్తుతం విలియమ్సన్ ఫామ్ లో కూడా లేడు. దాంతో ఇతడిని సన్ రైజర్స్ వదిలించుకునే అవకాశం ఉంది.
నికోలస్ పూరన్ ను కూడా వదిలేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం అతడి ప్రస్తుత ఫామ్. రూ. 10.75 కోట్ల భారీ మొత్తానికి పూరన్ ను గత వేలంలో సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. 14 మ్యాచ్ ల్లో 306 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ప్రస్తుతం ఫామ్ లో లేడు. దాంతో ఇతడిని వేలంలోకి రిలీజ్ చేసి.. మినీ వేలంలో తక్కువ రేటుకు మళ్లీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయొచ్చు.