IPL Mini Auction 2023 : ప్లాన్ మార్చిన సన్ రైజర్స్.. ఆ జింబాబ్వే ప్లేయర్ కోసం పక్కా ప్లాన్.. సొంతం చేసుకుంటే ప్రత్యర్థులకు దడే
IPL Mini Auction 2023 : ప్లాన్ మార్చిన సన్ రైజర్స్.. ఆ జింబాబ్వే ప్లేయర్ కోసం పక్కా ప్లాన్.. సొంతం చేసుకుంటే ప్రత్యర్థులకు దడే
IPL Mini Auction 2023 : ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో కనీస అవగాహన లేకుండా ప్లేయర్లను కొనుగోలు చేయడం సన్ రైజర్స్ కు శాపంగా మారింది. కేన్ విలియమ్సన్ తో పాటు రొమారియో షెపర్డ్, నికోలస్ పూరన్ లు అంచనాలను అందుకోవడం విఫలం అయ్యారు.
2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) చెత్త ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. 2021 సీజన్ కు కొనసాగింపు అన్నట్లు 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన ప్రదర్శనను కనబరిచింది.
2/ 8
ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో కనీస అవగాహన లేకుండా ప్లేయర్లను కొనుగోలు చేయడం సన్ రైజర్స్ కు శాపంగా మారింది. కేన్ విలియమ్సన్ తో పాటు రొమారియో షెపర్డ్, నికోలస్ పూరన్ లు అంచనాలను అందుకోవడం విఫలం అయ్యారు.
3/ 8
కేన్ విలియమ్సన్ అయితే టెస్టు బ్యాటింగ్ తో చిరాకు తెప్పించాడు. దాంతో 2023 సీజన్ కు ముందు సన్ రైజర్స్ కేన్ విలియమ్సన్, షెపర్డ్, పూరన్, సీన్ అబాట్ లతో పాటు మొత్తంగా 12 మంది ప్లేయర్లను వదిలించుకుంది.
4/ 8
డిసెంబర్ 23న జరిగే మినీ వేలంలో హైదరాబాద్ గరిష్టంగా 13 మంది ప్లేయర్లను కొనుగులు చేసే అవకాశం ఉంది. ఇందులో 9మంది భారతీయులను నలుగురు విదేశీయులను తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ అత్యధికంగా రూ. 42.25 కోట్లు మనీ పర్సు ఉంది.
5/ 8
ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్లు బెన్ స్టోక్స్, స్యామ్ కరణ్ లతో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ పై సన్ రైజర్స్ కన్నేసింది. అయితే వీరి కోసం ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీ పడటం ఖాయం.
6/ 8
దాంతో ఆఖరి నిమిషాల్లో సన్ రైజర్స్ ప్లాన్ మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రాజాపై కన్నేసినట్లు తెలుస్తుంది. సికిందర్ రాజా రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి రానున్నాడు.
7/ 8
గత కొంత కాలంగా సికిందర్ రాజా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇటీవలె ముగిసిన టి20 ప్రపంచకప్ లో కూడా సికిందర్ రాజా మెరుపులు మెరిపించాడు. సునీల్ నరైన్ లాంటి యాక్షన్ తో బౌలింగ్ చేసే సికిందర్ రాజా అటు బ్యాట్ తో పాటు ఇటు బంతితోనూ మ్యాచ్ లను మలుపు తిప్పగలడు.
8/ 8
ఈ క్రమంలో సికిందర్ రాజాను సొంతం చేసుకోవడానికి సన్ రైజర్స్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఒకవేళ వేలంలో సికిందర్ రాజాను సన్ రైజర్స్ సొంతం చేసుకుంటే అది జట్టుకు అనుకూల అంశం.