IPL 2023 Mini Auction : తమ్ముడిపై కోట్ల వర్షం కురిపించారు.. అన్నను మాత్రం ఒక్కడు కూడా పట్టించుకోలేదు.. ఎవరంటే?
IPL 2023 Mini Auction : తమ్ముడిపై కోట్ల వర్షం కురిపించారు.. అన్నను మాత్రం ఒక్కడు కూడా పట్టించుకోలేదు.. ఎవరంటే?
IPL 2023 Mini Auction : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యధికంగా 13 మందిని వేలంలో కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఐదుగురిని మాత్రమే సొంతం చేసుకుంది.
ఐపీఎల్ (IPL) 2023 సీజన్ కోసం కొచ్చి వేదికగా మినీ వేలం జరిగింది. దాదాపు 87 స్థానాల కోసం వేలం జరగ్గా.. 405 మంది క్రికెటర్లు పాల్గొన్నారు. 10 ఫ్రాంచైజీలు కలిసి 80 మందిని సొంతం చేసుకున్నాయి.
2/ 8
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యధికంగా 13 మందిని వేలంలో కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఐదుగురిని మాత్రమే సొంతం చేసుకుంది.
3/ 8
ఇంగ్లండ్ ప్లేయర్లపై ఈ వేలంలో కాసుల వర్షం కురిసింది. ఆల్ రౌండర్లు స్యామ్ కరణ్, బెన్ స్టోక్స్ లతో పాటు పవర్ హిట్టర్ హ్యారీ బ్రూక్ లు భారీ ధర పలికారు. ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా రికార్డు ధర పలికాడు.
4/ 8
ఇంగ్లండ్ యువ ఆల్ రౌండర్ స్యామ్ కరణ్ గత రికార్డులను అధిగమిస్తూ రూ. 18.5 కోట్ల ధర పలికాడు. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా స్యామ్ కరణ్ నిలిచాడు. కరణ్ ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
5/ 8
స్యామ్ కరణ్ అన్న టామ్ కరణ్ కూడా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే టామ్ కరణ్ ను కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు.
6/ 8
స్యామ్ కరణ్ కోసం పోటీ పడ్డ ఫ్రాంచైజీలు అన్న టామ్ కరణ్ పై మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు. కనీస ధరకు కూడా కొనుగోలు చేసేందుకు సాహసం చేయలేదు. దాంతో టామ్ కరణ్ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు..
7/ 8
స్యామ్ కరణ్ తర్వాత ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ రూ. 17.50 కోట్ల ధర పలికాడు. ముంబై ఇండియన్స్ ఈ మొత్తాన్ని చెల్లించి గ్రీన్ ను సొంతం చేసుకుంది.
8/ 8
వీరి తర్వాత ఇంగ్లండ్ టెస్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నిలిచాడు. స్టోక్స్ ను రూ. 16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ రూ. 16 కోట్ల ధర పలడం విశేషం.