ఐపీఎల్ లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ప్రతిభ ఉన్న భారత ప్లేయర్లను పసిగట్టడంలో ధోనిది ప్రత్యేక శైలి. ఈ క్రమంలోనే గతంలో మోహిత్ శర్మ చెన్నై తరఫున సూపర్ సక్సెస్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, ముఖేశ్ చౌదరీల ప్రతిభను గుర్తించి చెన్నై జట్టులో భాగం చేసేలా చేశాడు.