ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ఆరంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తమకు అవసరం లేని ప్లేయర్లను ఫ్రాంచైజీలు వదులుకున్న సంగతి తెలిసిందే. చాలా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చాయి. ఇది అభిమానులు అస్సలు ఊహించలేదు. ఇక, రిలీజ్ చేసిన ఆటగాళ్లలో స్టార్ ఓపెనర్లు కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈ స్టార్ ఓపెనర్లను దక్కించుకోవాలంటే వేలంలో కోట్లు కుమ్మరించాల్సిందే.
మయాంక్ అగర్వాల్: IPL వేలం 2023కి ముందు రిలీజ్ అయిన ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ ఉండటంతో చాలా మంది ఆశ్చర్యానికి గురుయ్యారు. అయితే.. ఎంతో టాలెంట్ ఉన్న ఈ బ్యాటర్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడే ఛాన్స్ ఉంది. గతేడాది పంజాబ్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహించిన మయాంక్.. 12 ఇన్నింగ్స్‌లలో 16.33 సగటుతో మరియు 122.50 స్ట్రైక్ రేట్‌తో కేవలం 196 పరుగులు చేశాడు. అయితే.. ఈ ప్రదర్శనతో సంతృప్తి చెందని పంజాబ్ కింగ్స్ అతన్ని విడుదల చేసింది. అయితే.. క్లాసీ షాట్లతో ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేసే మయాంక్ కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి ఫ్రాంచైజీలు వెనుకాడకపోవచ్చు. (AFP)
కేన్ విలియమ్సన్: మాజీ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL సీజన్ 2023కి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను విడుదల చేయడం ద్వారా సంచలన సృష్టించింది. విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL 2022 ప్లేఆఫ్ దశలోకి ఎంట్రీ ఇవ్వడంలో విఫలమైంది. 8 సీజన్లు పాటు సన్‌రైజర్స్ తో కేన్ మామకు అనుబంధం ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది డేంజరస్ ప్లేయర్ కేన్. దీంతో.. ఈ కివీస్ కెప్టెన్ ను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడే ఛాన్స్ ఉంది. (AFP)
ఎన్ జగదీషన్: నారాయణ్ జగదీషన్ చాలా కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో ఉన్నాడు. అయితే.. అతన్ని వచ్చే మినీ ఆక్షన్ కి విడుదల చేసింది సీఎస్కే. 2020 సీజన్ లో అత్యధిక స్కోరు 39తో అరంగేట్రం చేసిన తర్వాత జగదీషన్ ఐపీఎల్లో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడాడు. అయితే, ఈ ఏడు మ్యాచుల్లో అంతగా రాణించలేకపోయాడు. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న విజయ హాజారే ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా ఐదు సెంచరీలు చేశాడు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ పై ఏకంగా 277 పరుగులు చేశాడు. దీంతో పలు వరల్ట్ రికార్డుల్ని బ్రేక్ చేశాడు. దీంతో.. ఈ చెన్నై చిన్నోడి కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తం చెల్లించే అవకాశం ఉంది. (Instagram)
జాసన్ రాయ్: IPL 2022 వేలంలో జాసన్ రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ అతని బేస్ ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. వ్యక్తిగత కారణాలతో రాయ్ ఐపీఎల్ 2022 సీజన్ ఆడలేదు. దీంతో.. అతన్ని విడుదల చేసింది గుజరాత్ టైటాన్స్. రాయ్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. అతను తన 13 ఇన్నింగ్స్‌లలో 29.91 సగటుతో 329 పరుగులు చేశాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో జాసన్ రాయ్ కూడా వన్ ఆఫ్ ది డేంజరస్ బ్యాటర్. దీంతో.. అతన్ని దక్కించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడే ఛాన్స్ ఉంది. (PIC: PTI)